‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు’ అంటూ వస్తున్న ప్రచారంపై ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు

అధ్యక్షుడిని మార్చే ముందు బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్రంలోని సీనియర్ నాయకులను..

‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు’ అంటూ వస్తున్న ప్రచారంపై ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి మార్పు అంటూ వస్తున్న ప్రచారంపై ఆ పార్టీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఇవాళ ఆయన మాట్లాడుతూ.. దూకుడుగా ఉన్న నేత తెలంగాణకు బీజేపీ అధ్యక్షుడిగా ఉండాలని చెప్పారు. రాష్ట్ర అధ్యక్షుడుని మార్చుతారంటూ వార్తలు వస్తున్నాయని తెలిపారు.

అధ్యక్షుడిని మార్చే ముందు బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్రంలోని సీనియర్ నాయకులను సంప్రదించాలని రాజాసింగ్ అన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలపై ప్రజలు నమ్మకం కోల్పోయారని తెలిపారు. తెలంగాణలో బీజేపీకి మంచి వాతావరణము ఉందని చెప్పారు. ఒకప్పుడు బీజేపీకి తెలంగాణలో ఒక్కరే ఎమ్మెల్యే ఉండేనని చెప్పారు.

ఇప్పుడు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అయ్యారని గుర్తుచేశారు. ఒకప్పుడు నలుగురు ఎంపీలు ఉంటే ఇప్పుడు ఎనిమిది మంది ఎంపీలు అయ్యారని అన్నారు. అంతేగాక, తమకు జీహెచ్ఎంసీలో 40 మందికరి పైగా కార్పొరేటర్లు ఉన్నారని తెలిపారు. తెలంగాణలో రాబోయేది తమ సర్కారేనని చెప్పారు. కాబోయే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడికి దేశం పట్ల, ధర్మం పట్ల, సమాజం పట్ల అవగాహన ఉండాలని అన్నారు.

Also Read: చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం అంటూ అతడి వీడియో పోస్ట్ చేసి హెచ్చరించిన సజ్జనార్