Mla RohitReddy: మళ్ళీ భాగ్యలక్ష్మి ఆలయానికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి.. బండి సంజయ్ ఎందుకు రాలేదని ఆగ్రహం
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ హైదరాబాద్, చార్మినార్ లోని భాగ్యలక్ష్మి ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలని సవాలు విసిరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఇవాళ కూడా ఆ ఆలయం వద్దకు వెళ్లారు. డ్రగ్స్ కేసుతో తనకు సంబంధం లేదంటూ రోహిత్ రెడ్డి నిన్న భాగ్యలక్ష్మి అమ్మవారిపై ప్రమాణం చేసి చెప్పిన విషయం తెలిసిందే. బండి సంజయ్ ఇవాళ ఉదయం చార్మినార్ లోని భాగ్యలక్ష్మి ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలని, తాను కూడా అదే సమయానికి వస్తానని ఆ సందర్భంగా చెప్పారు. బండి సంజయ్ రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Mla RohitReddy: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ హైదరాబాద్, చార్మినార్ లోని భాగ్యలక్ష్మి ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలని సవాలు విసిరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఇవాళ కూడా ఆ ఆలయం వద్దకు వెళ్లారు. డ్రగ్స్ కేసుతో తనకు సంబంధం లేదంటూ రోహిత్ రెడ్డి నిన్న భాగ్యలక్ష్మి అమ్మవారిపై ప్రమాణం చేసి చెప్పిన విషయం తెలిసిందే. బండి సంజయ్ ఇవాళ ఉదయం చార్మినార్ లోని భాగ్యలక్ష్మి ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలని, తాను కూడా అదే సమయానికి వస్తానని ఆ సందర్భంగా చెప్పారు.
చెప్పినట్లే ఇవాళ భాగ్యలక్ష్మి ఆలయానికి వచ్చారు. బండి సంజయ్ ఎందుకు రాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… తన సవాలును బండి సంజయ్ స్వీకరించలేదని చెప్పారు. దీంతో బండి సంజయ్ చేసిన ఆరోపణలన్నీ అసత్యాలేనని అందరికీ తెలిసిందని వ్యాఖ్యానించారు. డ్రగ్స్ కేసులో తన ప్రమేయం లేదని చెప్పారు. తనకు నోటీసులూ రాలేదని, తనపై ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని అన్నారు. అసత్యాలు చెప్పడం బీజేపీకి వెన్నతో నేర్పిన విద్యని విమర్శించారు.
ప్రత్యర్థులను బీజేపీ ఈడీ, ఐటీ, సీబీఐ పేర్లతో ఇబ్బందులు పెడుతున్నది నిజం కాదా? అంటూ నిలదీశారు. తనను బీజేపీ నేతలు ప్రలోభపెట్టడానికి ప్రయత్నించింది నిజం కాదా? అని ప్రశ్నించారు. దొంగ స్వాముల సాయంతో ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నించలేదా? అని అడిగారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి తాజాగా ఈడీ నుంచి నోటీసులు అందిన విషయం తెలిసిందే. అయితే, నోటీసులు అందడానికి ముందే రోహిత్ రెడ్డిపై బండి సంజయ్ పలు ఆరోపణలు చేశారు.
Father Suicide : గుజరాత్ లో విషాదం.. కూతురి కాలేజీ ఫీజు చెల్లించలేక తండ్రి ఆత్మహత్య