MLC bypoll: తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

దీంతో ఇప్పటికే వారిద్దరు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు.

MLC bypoll: తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

BYpoll

తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైంది. గతంలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కౌశిక్‌రెడ్డి, కడియం శ్రీహరి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన విషయం తెలిసిందే.

దీంతో వారిద్దరు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. వారి స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు, ఉత్తరప్రదేశ్‌లోనూ ఒక స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది.

ప్రస్తుతం పార్టీలకు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఆధారంగా కాంగ్రెస్‌కు ఒక ఎమ్మెల్సీ, బీఆర్ఎస్‌కు ఒక ఎమ్మెల్సీ వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 64, సీపీఐకు 1, బీఆర్ఎస్‌కు 39, బీజేపీకి 8, ఎంఐఎంకి 7 ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఉంది.

 తెలంగాణ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల షెడ్యూల్

  • ఈ నెల 11న నోటిఫికేషన్ విడుదల
  • నామినేషన్లు వేయడానికి చివరి తేదీ ఈ నెల 18
  • నామినేషన్ల పరిశీలన ఈ నెల 19న
  • ఈ నెల 29న ఎన్నికలు
  • పోలింగ్ సమయం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు..
  • ఆ తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్

పూర్తి వివరాలు..

Ganji Chiranjeevi: ఏపీ ఎన్నికల్లో వైసీపీ గెలవబోయే మొదటి సీట్ ఇదే: గంజి చిరంజీవి