Ganji Chiranjeevi: ఏపీ ఎన్నికల్లో వైసీపీ గెలవబోయే మొదటి సీట్ ఇదే: గంజి చిరంజీవి

టీడీపీ నేత నారా లోకేశ్ మరోసారి ఓడిపోవడం ఖాయమని చెప్పారు.

Ganji Chiranjeevi: ఏపీ ఎన్నికల్లో వైసీపీ గెలవబోయే మొదటి సీట్ ఇదే: గంజి చిరంజీవి

Ganji Chiranjeevi

Updated On : January 4, 2024 / 4:19 PM IST

ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి వైసీపీ ఇన్‌చార్జి గంజి చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన 10టీవీతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలవబోయే మొదటి సీట్ మంగళగిరేనని చెప్పారు.

మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి ముఖం చూసి ఎవరూ ఓటు వేయరని గంజి చిరంజీవి అన్నారు. గత ఎన్నికల్లో వైఎస్ జగన్ చెప్పారని ఆర్కేకు ఓట్లు వేశారని అన్నారు. టీడీపీ నేత నారా లోకేశ్ మరోసారి ఓడిపోవడం ఖాయమని చెప్పారు. మంగళగిరిలో బీసీలకు జగన్ అవకాశం ఇచ్చారని అన్నారు.

బీసీకి అవకాశం ఇస్తే ఈర్ష్యతో ఆర్కే బయటకి పోయారని గంజి చిరంజీవి చెప్పారు. గతంలో నియోజకవర్గంలో 500 కోట్ల రూపాయల అభివృద్ధి చేశానని ఆర్కే చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు అభివృద్ధి జరగలేదని మరోలా చెబుతున్నారని అన్నారు. సీఎం సహకరించకపోతే మంగళగిరిలో అంతగా అభివృద్ధి లా జరిగిందని నిలదీశారు. ఆర్కే వ్యాఖ్యలను మంగళగిరి ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు.

Lok Sabha polls : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బండి సంజయ్‌కు కీలక పదవి