MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్

టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఊహించినట్లే కాంగ్రెస్‌కు జై కొట్టారు టీఆర్ఎస్ ఓటర్లు. కాంగ్రెస్ పార్టీ సంఖ్యా బలానికి ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది. తెరాస పార్టీకి సంబంధించిన 140ఓట్లు..

MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్

Mlc Elections (1)

Updated On : December 14, 2021 / 10:39 AM IST

MLC Elections: టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఊహించినట్లే కాంగ్రెస్‌కు జై కొట్టారు టీఆర్ఎస్ ఓటర్లు. కాంగ్రెస్ పార్టీ సంఖ్యా బలానికి ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది. తెరాస పార్టీకి సంబంధించిన 140ఓట్లు క్రాస్ అయినట్లు తెలుస్తుంది. ఖమ్మం, కొత్తగూడెం నియోజకవర్గాల్లో భారీగా క్రాస్ అయినట్లుగా ప్రచారం జరుగుతుంది.

వాస్తవానికి కాంగ్రెస్‌కు ఉన్న బలం 103 మాత్రమే. కానీ, 242 వచ్చినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఈ క్రాస్ ఓటింగ్ పై ఆరా తీస్తుంది. ఏ నియోజకవర్గం నుంచి క్రాస్ ఓటింగ్ జరిగిందనే వివరాలు సేకరించే పనిలో పడింది టీఆర్ఎస్.

దీనిపై మంత్రి అజయ్ కుమార్ మరికొద్దిసేపట్లో జరగనున్న ప్రెస్ మీట్ లో మాట్లాడునున్నారు.

………………………………………. : శ్రీరామ్ బిగ్‌బాస్‌ గెలుపు కోసం ఆటో తోలిన రవి