Professor Kodandaram: కవిత అరెస్టును తెలంగాణ సమస్యగా చిత్రీకరిస్తున్నారు: టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం
కవిత అరెస్టును తెలంగాణ సమస్యగా చిత్రీకరిస్తున్నారు. ఇది తెలంగాణ ప్రజల సమస్య కాదు. కవిత అంశం తెలంగాణకు ముడిపెట్టడం సరికాదు. ఇది అధికార మదం. అహంకారం. సారాయి వ్యాపారాన్ని విస్తరించేందుకు కవిత ప్రయత్నించింది. సారాయి వ్యాపారంతో కవితకు ఏం పని?

Professor Kodandaram
Professor Kodandaram: ఎమ్మెల్సీ కవిత అరెస్టును తెలంగాణ సమస్యగా చిత్రీకరించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందన్నారు టీజేఎస్ (తెంగాణ జన సమితి) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం. కవిత అరెస్టు తెలంగాణ సమస్య కాదన్నారు. ప్రొఫెసర్ కోదండరాం గురువారం మీడియాతో మాట్లాడారు.
‘‘కవిత అరెస్టును తెలంగాణ సమస్యగా చిత్రీకరిస్తున్నారు. ఇది తెలంగాణ ప్రజల సమస్య కాదు. కవిత అంశం తెలంగాణకు ముడిపెట్టడం సరికాదు. ఇది అధికార మదం. అహంకారం. సారాయి వ్యాపారాన్ని విస్తరించేందుకు కవిత ప్రయత్నించింది. సారాయి వ్యాపారంతో కవితకు ఏం పని? కవిత మహిళా బిల్లుపై జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తా అనడం సిగ్గుచేటు. సొంత వ్యాపారం కోసం అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేస్తారు? కవితను పార్టీ నుంచి కేసీఆర్ ఎందుకు సస్పెండ్ చేయడం లేదు. తెలంగాణ ప్రజలు నిరుద్యోగం, అధిక ధరలతో సతమతమవుతున్నారు.
కవిత విషయంలో, అదానీ విషయంలో టీజేఎస్ ఒకే విధానంతో ఉంది. రేపు మిలియన్ మార్చ్ స్ఫూర్తితో తెలంగాణ బచావో సదస్సు నిర్వహిస్తున్నాం. ఈ సదస్సుకు తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు తరలిరావాలి. రాష్ట్ర పరిస్థితులపై సదస్సులో చర్చించి, భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తాం’’ అని కోదండరాం వ్యాఖ్యానించారు.