Motkupalli Narasimhulu : జగన్ ది రౌడీ రాజకీయం.. చంద్రబాబు అరెస్ట్ ప్రజాస్వామ్యానికే ముప్పు.. కేసీఆర్ ఖండించాలి..
రెండు మూడు రోజుల్లో రాజమండ్రి వెళ్ళి భువనేశ్వరిని కలిసి పరామర్శిస్తాను. అవకాశం ఉంటే జైల్లో చంద్రబాబును కలుస్తాను. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా రేపు ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఒకరోజు నిరసన దీక్ష చేస్తానని మోత్కుపల్లి అన్నారు.

Motkupalli Narasimhulu
Motkupalli Narasimhulu : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మోత్కుపల్లి నర్సింహులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం మోత్కుపల్లి మీడియాతో మాట్లాడారు. ఇదే ఎన్టీఆర్ ఘాట్ నుంచి జగన్ గెలవాలని కోరుకున్నా.. నా మాట ప్రకారం దళిత వర్గాలంతా ఏకమై జగన్ ను గెలిపించారు. గెలిచిన తరువాత జగన్ కు ఒకమైకం వచ్చింది.. ఆ మైకంలో కన్నతల్లిని బయటకు పంపించాడు. ఆ తరువాత జగన్ కోసం పాదయాత్ర చేసిన చెల్లి షర్మిలను బయటకు గెంటేశాడు అంటూ మోత్కుపల్లి విమర్శించారు. జగన్ పరిపాలించే రాష్ట్రానికి రాజధాని లేదు. రాజధాని లేని రాజ్యానికి నియంత జగన్. ఒక్క అవకాశం ఇస్తే బాగా పాలన చేస్తాడని ప్రజలు నమ్మారు.. జగన్ కు పిచ్చి నెత్తికెక్కింది.. ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని చిత్ర హింసలకు గురిచేస్తున్నాడు అంటూ మోత్కుపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Chandrababu quash petition: సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు
74ఏళ్ల పెద్దమనిషి చంద్రబాబు.. దేశంలో ఎంతో అనుభవం కలిగిన నేతను జైల్లో పెడతావా? చంద్రబాబును జైల్లో పెట్టి జగన్ రాక్షస ఆనందం పొందుతున్నాడు. ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పెరు లేదు.. గవర్నర్ అనుమతి తీసుకోకుండా రాజ్యాంగానికి విరుద్ధంగా అరెస్ట్ చేశారని మోత్కుపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. 7, 8 లక్షల కోట్ల బడ్జెట్ ఖర్చు చేసిన చంద్రబాబు ముష్టి 300 కోట్ల కోసం అవినీతి కి పాల్పడతాడా..? చంద్రబాబు ఎప్పుడు కక్ష్య సాధింపులకు పాల్పడిన వ్యక్తి కాదు. చంద్రబాబును చంపుతావా జగన్.. చంద్రబాబు క్రిమినల్ కాదు. వెంటనే చంద్రబాబు వయసుకు విలువిచ్చి జగన్ క్షమాపణ చెప్పాలి. ఇప్పటికైనా జగన్ తన తప్పును సరిదిద్దుకోవాలి అంటూ మోత్కుపల్లి సూచించారు. దోమలు కుడుతున్నాయని చంద్రబాబు జడ్జికి చెప్పారు. జైల్లో చంద్రబాబుకు ఏమైనా అయితే నువ్వే భాద్యుడవు జగన్ అంటూ హెచ్చరించారు.
Read Also : Nara Lokesh: సీఎం జగన్‌కు 10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేశ్.. !
చంద్రబాబు అరెస్ట్ ప్రజాస్వామ్య నీకె ముప్పు. 2, 3 రోజుల్లో రాజమండ్రి వెళ్ళి భువనేశ్వరిని కలిసి పరామర్శిస్తాను. అవకాశం ఉంటే జైల్లో చంద్రబాబును కలుస్తాను. జగన్ ది రౌడీ రాజకీయం. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా రేపు ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఒకరోజు నిరసన దీక్ష చేస్తానని మోత్కుపల్లి అన్నారు. చంద్రబాబు అరెస్ట్‌ను తెలంగాణ సీఎం కేసీఆర్ ఖండించాలి. ప్రత్యేకంగా కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. జగన్.. నీ నాటకాలన్నీ ప్రజలకు అర్ధమయ్యాయి. జగన్ దళిత ద్రోహి.. దళితులు జగన్‌కు ఓటెయ్యరు. జైల్లో ఉన్న చంద్రబాబునే ప్రజలు గెలిపిస్తారని మోత్కుపల్లి అన్నారు.