Moosi Project Flood : మూసీలోకి భారీగా వరదనీరు… 8 గేట్లు ఎత్తివేత

గత మూడు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో నల్గొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్ట్ లోకి భారీగా వరదనీరు వచ్చిచేరుతోంది. 

Moosi Project  Flood : మూసీలోకి భారీగా వరదనీరు… 8 గేట్లు ఎత్తివేత

Moosi Project

Updated On : September 29, 2021 / 9:40 AM IST

Moosi Project Flood : గత మూడు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో నల్గొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్ట్ లోకి భారీగా వరదనీరు వచ్చిచేరుతోంది.  ప్రాజెక్టులోకి 13,401 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు ఎనిమిది గేట్లను మూడు అడుగుల మేర ఎత్తి 13,401 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా…. ప్రస్తుతం 638.50 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది.

మూసీ గరిష్ట సామర్థ్యం 4.46 టీఎంసీలుకాగా, 2.88 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. గులాబ్ తుపాను ప్రభావంతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ జలాశయాల గేట్లను ఎత్తివేయడంతో మూసీకి వరద పోటెత్తుతోంది.చాదర్‌ఘాట్‌, వద్ద వంతెనను ఆనుకుని మూసీ ప్రవహిస్తోంది.

పులిచింతల ఐదు గేట్లు ఎత్తివేత
మరో వైపు పులిచింతల ప్రాజెక్ట్ కు వరద నీరు పోటెత్తడంతో అధికారులు ఐదు గేట్లు ఎత్తివేశారు. ప్రాజెక్టులోకి 70,812 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 61,358 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పులిచింతల పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలకుగాను 33.40 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.