Narendra Modi: మీ దుఖాన్ని మాటల్లో వ్యక్తపరచలేము.. అంటూ గద్దర్ భార్యకు ప్రధాని మోదీ లేఖ

తెలంగాణ సాంప్రదాయక కళారూపాన్ని పునరుజ్జీవింపజేయడంలో ఆయన చేసిన కృషి ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని మోదీ అన్నారు.

Narendra Modi

Narendra Modi – Gaddar: ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల కన్నుమూసిన ప్రజాగాయకుడు గద్దర్ భార్య విమలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేఖ రాశారు. ప్రజా గాయకుడు గద్దర్ అనారోగ్యంతో మృతి చెందారనే విషయాన్ని బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి (Vivek Venkatswamy) తాజాగా మోదీ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో మోదీ లేఖ రాశారు.

” గద్దర్ మృతి గురించి తెలుసుకుని చాలా బాధపడ్డాను.. తీవ్ర దుఃఖంలో ఉన్న ఈ సమయంలో మీ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను. గద్దర్ పాటలు, ఇతివృత్తాలు సమాజంలోని బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రతిబింబిస్తాయి. గద్దర్ రచనలు ప్రజలకు ప్రోత్సాహాన్ని కూడా అందించాయి.

తెలంగాణ సాంప్రదాయక కళారూపాన్ని పునరుజ్జీవింపజేయడంలో ఆయన చేసిన కృషి ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మీ దుఖాన్ని మాటల్లో వ్యక్తపరచలేము. కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు ఈ దుఃఖాన్ని తట్టుకునే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఓం శాంతి ” అని మోదీ లేఖలో పేర్కొన్నారు.

PM Modi : నలభై ఏళ్ల తర్వాత గ్రీస్‌లో పర్యటించిన మొదటి ప్రధాని మోదీ