తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త ట్విస్ట్: రేవంత్ రెడ్డికి కొత్త పదవి?!

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కమిటీ ఎవరనే సస్పెన్స్ కొనసాగుతూ ఉండగా.. త్వరలో టీపీసీసీ కొత్త చీఫ్‌ను ప్రకటించించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు రేసులో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి పేర్లు బలంగా వినిపించగా.. అనూహ్యంగా తెరపైకి సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు వచ్చింది. టీపీసీసీ చీఫ్‌గా కాంగ్రెస్ అధిష్ఠానం జీవన్ రెడ్డి పేరును ఖరారు చేసినట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుని విషయంలో ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు కానీ,.. సోనియా గాంధీ తుది నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. రేవంత్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించినా సీనియర్ల అసంతృప్తి కారణంగా చివరకు ఆయనకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించలేదని తెలుస్తుంది. వారం క్రితమే జీవన్‌రెడ్డిని ఢిల్లీకి పిలిచి మాట్లాడిన హైకమాండ్.. దీనిపై తుదినిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు.
ఎంపీ పదవి కోసం కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి చివరివరకు ప్రయత్నాలు చేయగా.. రేవంత్‌కు అధిష్టానం సర్తిచెప్పినట్లుగా తెలుస్తుంది. రేవంత్‌కు ప్రచారకమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించినట్లు చెబుతున్నారు. మధ్యేమార్గంగా సీనియర్లు జీవన్ రెడ్డితోపాటు శశిధర్ రెడ్డి పేర్లను కూడా కాంగ్రెస్ పరిశీలించగా.. ఫైనల్‌గా జీవన్ రెడ్డి వైపే అధిష్టానం మొగ్గు చూపినట్లు తెలుస్తుంది.
రాబోయే ఎన్నికల్లో పొత్తులు ఎత్తులు విషయంలో కరీంనగర్‌దే కీలకపాత్ర ఉండనుందని, బీజేపీ అధ్యక్షుడిగా దూకుడు చూపుతున్న ఎంపీ బండి సంజయ్‌ది కూడా కరీంనగరే కాగా.. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, సీపీఐ రాష్ట్ర అధ్యక్షుడు చాడ వెంకటరెడ్డిది కూడా కరీంనగరే.. అయితే ఈ పదవికి రేవంత్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, డీ శ్రీధర్ బాబు, మధుయాష్కి గౌడ్, దామోదర రాజనర్సింహ తదితరుల పేర్లను కూడా అధిష్టానం పరిశీలించింది. అయితే రేవంత్‌కే అధ్యక్ష పదవి దక్కవచ్చు అని అందరూ భావించినా.. రేవంత్ విషయంలో హైకమాండ్ కాస్త వెనుకడుగు వేసినట్లుతెలుస్తుంది.
పలువురు సీనియర్ నేతలు రేవంత్ రెడ్డిని వ్యతిరేకించడం, వరుసగా అధిష్టానంకు తమ అభిప్రాయాలు తెలుపుతూ లేఖలు రాయడంతో రేవంత్ రెడ్డిని పక్కన పెట్టింది. సీనియర్ నాయకుల్ని సంతృప్తి పరిచేవిధంగా జీవన్ రెడ్డి పేరు ఖరారు చేసింది.