Vanama Raghavendra Rao : పాల్వంచ రామకృష్ణ కేసులో ఊహించని ట్విస్ట్.. తల్లి, అక్క సంచలన వ్యాఖ్యలు

ఈ కేసుతో వనమా రాఘవేంద్రకు ఎలాంటి సంబంధం లేదని చెబుతోంది. రాఘవేంద్రతో తమకు ఎలాంటి గొడవలు లేవని చెప్పింది. వనమా కుటుంబంతో పాతికేళ్లుగా తమకు సత్సంబంధాలు ఉన్నాయని సూర్యావతి తెలిపింది.

Vanama Raghavendra Rao : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన పాల్వంచ రామకృష్ణ ఆత్మహత్య కేసు మరో మలుపు తిరిగింది. రామకృష్ణ తల్లి, అక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. వనమా రాఘవేంద్రరావు మంచోడు, నా కొడుకే చెడ్డోడు అంటోంది రామృష్ణ తల్లి సూర్యావతి. వనమా రాఘవ గురించి తన కొడుకు రామకృష్ణ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవం అంటోంది అతడి తల్లి సూర్యావతి. అసలు ఈ కేసుతో వనమా రాఘవేంద్రకు ఎలాంటి సంబంధం లేదని చెబుతోంది. రాఘవేంద్రతో తమకు ఎలాంటి గొడవలు లేవని చెప్పింది. వనమా కుటుంబంతో పాతికేళ్లుగా తమకు సత్సంబంధాలు ఉన్నాయని సూర్యావతి తెలిపింది. ఎవరో కావాలనే రాఘవేంద్రను ఇందులో ఇరికిస్తున్నారని ఆమె ఆరోపించింది.

VIVO V23 PRO 5G: రంగులు మార్చుకునే VIVO ఫోన్

”రామకృష్ణ బలాదూర్ గా తిరిగేవాడు. రామకృష్ణ వల్లే నా చిన్నకొడుకు చనిపోయాడు. మా ఇంట్లో మంచి, చెడు అన్నీ వనమా కుటుంబమే చూసేది” అని తల్లి సూర్యావతి చెప్పింది. ”నా తమ్ముడు ఇంత ఘోరం చేస్తాడని అనుకోలేదు. ఆస్తి వివాదంతో సంబంధం లేదు. ఆత్మహత్యకు ముందు రామకృష్ణ ఉరి వేసుకోవాలని ప్రయత్నించాడు. రాఘవేంద్ర మాకు ఎప్పటినుంచో తెలుసు” అని రామకృష్ణ అక్క మాధవి చెప్పింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియోలో వనమా రాఘవేంద్రరావుపై రామకృష్ణ తీవ్ర ఆరోపణలు చేశారు.

Weight Loss : బరువు తగ్గటంలో వ్యాయామాలకు తోడుగా..

‘వనమా రాఘవ కారణంగా ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయి. అలాంటి దుర్మార్గులను రాజకీయంగా ఎదగనివ్వొద్దు. డబ్బు రూపంలో ఎంత అడిగినా ఇచ్చేవాడిని. కానీ ఏ భర్త కూడా వినకూడని మాటను రాఘవ అడిగారు. పిల్లలు లేకుండా నా భార్యను హైదరాబాద్‌‌కు ఒంటరిగా తీసుకురావాలని కోరారు. నీ భార్యను నా దగ్గరికి పంపిస్తే నువ్వు అడిగిన పని చేసి పెడతా.. లేకపోతే ఒక్కడు కూడా నీకు సాయం చేసేందుకు ముందుకు రాడని బెదిరించాడు. రాజకీయ, ఆర్థిక బలంతో పబ్బం గడుపుకోవాలని చూశారు. నేను ఒక్కడినే వెళ్లిపోతే నా భార్య, పిల్లలను వదిలిపెట్టరు. అందుకే నాతో పాటు వారినీ తీసుకెళ్తున్నా. అప్పుల్లో ఉన్న నాపై నా తల్లి, సోదరి కక్ష సాధించారు’’ అని నాగ రామకృష్ణ సెల్ఫీ వీడియోలో చెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

తన చావుకి వనమా రాఘవేంద్ర కారణం అని రామకృష్ణ ఆరోపించగా, అందులో వాస్తవం లేదని రామకృష్ణ తల్లి, అక్క చెప్పడం ఇప్పుడు మరింత సంచలనమైంది.

కాగా, నాగ రామకృష్ణ తన భార్య శ్రీలక్ష్మి, ఇద్దరు పిల్లలు సాహితి, సాహిత్యపై సోమవారం(జనవరి 3) తెల్లవారుజామున పెట్రోల్‌ పోసి తానూ నిప్పటించుకున్నాడు. ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు సజీవ దహనం కాగా.. 80శాతం గాయాలతో తీవ్రంగా గాయపడిన సాహితి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం(జనవరి 5) కన్నుమూసింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే వనమా రాఘవపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు వనమా రాఘవను టీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది.

ట్రెండింగ్ వార్తలు