రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు

  • Published By: chvmurthy ,Published On : November 19, 2019 / 02:35 AM IST
రాష్ట్రంలో నేడు, రేపు  వర్షాలు

Updated On : November 19, 2019 / 2:35 AM IST

మంగళ, బుధ వారాల్లో  తెలంగాణ రాష్ట్రంలో తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని  హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు చెప్పారు.  దక్షిణ శ్రీలంక తీరం దగ్గరలోని హిందూ మహా సముద్రం నుంచి ఉత్తర తమిళనాడు తీరం దగ్గరలో ఉన్న నైరుతి బంగాళా ఖాతం వరకు  ఉపరి తల ద్రోణి కొనసాగుతోందని పేర్కోంది.

దీని  ప్రభావం వలన ఈశాన్య దిశనుంచి  చలిగాలులు వీస్తాయనన వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి.  చలి పెరుగుతోంది. సోమవారం తెల్లవారుఝూమున రంగారెడ్డి జిల్లా కోహిర్ లో అత్యల్పంగా 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది.