NIMS Four Kidney Transplants : నిమ్స్ వైద్యులు రికార్డు.. 24 గంటల్లోనే 4 కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్లు.. బతికుండగానే ఒకరు కిడ్నీ దానం

హైదరాబాద్ నిమ్స్ వైద్యులు రికార్డు సృష్టించారు. కేవలం 24 గంటల్లోనే నాలుగు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్లు నిర్వహించారు. రూ.10లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఖర్చు అయ్యే ఈ కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చికిత్సను ఆరోగ్య శ్రీ పథకం కింద పేద రోగులకు ఉచితంగా నిర్వహించారు.

NIMS Four Kidney Transplants : నిమ్స్ వైద్యులు రికార్డు.. 24 గంటల్లోనే 4 కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్లు.. బతికుండగానే ఒకరు కిడ్నీ దానం

kidney transplants

Updated On : December 21, 2022 / 9:15 PM IST

NIMS Four Kidney Transplants : హైదరాబాద్ నిమ్స్ వైద్యులు రికార్డు సృష్టించారు. కేవలం 24 గంటల్లోనే నాలుగు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్లు నిర్వహించారు. రూ.10లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఖర్చు అయ్యే ఈ కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చికిత్సను ఆరోగ్య శ్రీ పథకం కింద పేద రోగులకు ఉచితంగా నిర్వహించారు. గత ఐదు సంవత్సరాల నుంచి డయాలసిస్ చికిత్స పొందుతున్న బాధితులకు బ్రెయిన్ డెడ్ అయిన ముగ్గురు రోగుల నుంచి కిడ్నీలు మార్పిడి చేశారు.

అయితే ఒకరు బతికుండగానే కిడ్నీని దానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ నాలుగు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్స్ విజయవంతం అయ్యాయని నిమ్స్ వైద్యులు వెల్లడించారు. నిమ్స్ యూరాలజీ విభాగం అధిపతి ప్రొఫెసర్ డాక్టర్ రాంరెడ్డి, ప్రొఫెసర్ డాక్టర్ రాహూల్ దేవరాజ్ ఆధ్వర్యంలో కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్స్ జరిగాయి.

Minister Harish Rao : నిమ్స్ ఆస్పత్రికి 200 ఐసీయూ బెడ్స్.. 120 కొత్త వెంటిలేటర్లు

డాక్టర్ విద్యాసాగర్, డాక్టర్ రామచంద్రయ్య, డాక్టర్ రఘువీర్, డాక్టర్ చరణ్ కుమార్, డాక్టర్ ధీరజ్, డాక్టర్ వినయ్, డాక్టర్ సునీల్, డాక్టర్ అరుణ్, డాక్టర్ విష్ణు, డాక్టర్ పవన్, డాక్టర్ హర్ష, డాక్టర్ జానకి, డాక్టర్ సూరజ్, డాక్టర్ పూవరసన్, డాక్టర్ అనంత్, డాక్టర్ షారూక్, అనస్థషీయా డాక్టర్లు డాక్టర్ పద్మజా, డాక్టర్ నిర్మల, డాక్టర్ ఇందిరా, డాక్టర్ గీత కలిసి శస్త్ర చికిత్సలు నిర్వహించారు.