Nirmal Bus Accident : నిర్మల్ జిల్లాలో ఘోర ప్రమాదం.. 2 ఆర్టీసీ బస్సులు ఢీ.. 30మందికి గాయాలు
నిర్మల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 30మంది ప్రయాణికులు గాయపడ్డారు.

Bus Accident
Nirmal Bus Accident : నిర్మల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 30మంది ప్రయాణికులు గాయపడ్డారు. భైంసా మండలం తిమ్మాపూర్ దగ్గర సోమవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. రెండు ఆర్టీసీ బస్సులు పరస్పరం ఢీకొన్నాయి. భైంసా నుంచి నిర్మల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును అదే రోడ్డులో వేగంగా దూసుకొచ్చిన మరో ఆర్టీసీ బస్సు వెనక నుంచి బలంగా ఢీకొట్టింది.
Whatsapp Chatting : వాట్సప్ చాటింగ్‌పై భార్యకు భర్త మందలింపు.. ఫలితం రెండు చావులు
ఈ ఘటనలో రెండు బస్సుల్లో ఉన్న 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో 20 మంది వరకు స్వల్పంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు 108 వాహనంలో వారిని భైంసా ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు మహిళలకు కాళ్లు విరగడంతో వారిని మెరుగైన చికిత్స కోసం నిర్మల్ కు తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదం సమయంలో రెండు బస్సుల్లో సుమారు 80మంది వరకు ప్రయాణికులు ఉన్నారు.