Dead Body Fridge : తాత మృతదేహాన్ని ఫ్రిడ్జ్ లో దాచి పెట్టిన మనవడు

వరంగల్ జిల్లా పరకాలో దారుణం చోటు చేసుకుంది. అంత్యక్రియలకు డబ్బులు లేకపోవడంతో తాత మృతదేహాన్ని మనవడు ఇంట్లోని ఫ్రిడ్జ్ లో దాచి పెట్టాడు.

Dead Body Fridge : తాత మృతదేహాన్ని ఫ్రిడ్జ్ లో దాచి పెట్టిన మనవడు

Dead Body

Updated On : August 12, 2021 / 6:02 PM IST

dead body in the fridge : వరంగల్ జిల్లా పరకాలలో దారుణం చోటు చేసుకుంది. అంత్యక్రియలకు డబ్బులు లేకపోవడంతో తాత మృతదేహాన్ని మనవడు ఇంట్లోని ఫ్రిడ్జ్ లో దాచి పెట్టాడు. మూడు రోజుల క్రితం బాలయ్య అనే వృద్ధుడు మృతి చెందాడు. సమాచారం అందుకుని ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసుల కథనం ప్రకారం..కామారెడ్డికి చెందిన రిటైర్ట్ ఉద్యోగి బాలయ్య(93), తన మనవడు నిఖిల్ ఎనిమిది సంవత్సరాల క్రితం బతుకు దెరువు కోసం పరకాలకు వచ్చి స్థిర పడ్డారు. పట్టణంలోని ఓ కాంప్లెక్స్ లోని అద్దె రూమ్ లో ఉంటున్నారు. కాంప్లెక్స్ లో వీరితోపాటు 30 కుటుంబాలు నివాసముంటున్నాయి. బాలయ్యకు వచ్చే ఫించన్ డబ్బులతోనే ఇద్దరూ జీవినం సాగిస్తున్నారు.

అయితే మూడు రోజుల క్రితం బాలయ్య అనారోగ్యతంతో మృతి చెందాడు. అంత్యక్రియలకు డబ్బులు లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోని మనవడు తాత మృతదేహాన్ని ఇంట్లోని ఫ్రిడ్జ్ లో కుక్కిపెట్టాడు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు మనవడిని అడిగారు. ఇంట్లో ఎలుకలు, ఇతర కీటకాలు చనిపోవడంతో వాసన వస్తుందని మేనేజ్ చేస్తూ వచ్చాడు.

కానీ ఇవాళ మూడో రోజు అధికంగా దుర్వాసన రావడంతో మనవడు పరకాల పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. తాత మృతదేహాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టిన విషయం, మృతి చెంది మూడు రోజులైనా బయటి సమాజానికి చెప్పలేదన్న విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. ఏసీపీ శివరామయ్య నేతృత్వంలో హుటాహుటినా పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని పరిశీలించగా ఫ్రిడ్జ్ లో మృతదేహం కుక్కి వేయబడి ఉంది.

దీనికి సంబంధించి అతన్ని ప్రశ్నించడంతో భయపడుతూ సమాధానం ఇచ్చాడు. కేవలం దహన సంస్కారాలకు డబ్బులు లేకపోవడంతోనే ఇలా చేశానని చెప్పాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.