Gandhi Hospital : గాంధీ ఆస్పత్రిలో నేటి నుంచి నాన్ కోవిడ్ సేవలు ప్రారంభం
హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో నేటి నుంచి నాన్ కోవిడ్ సేవలు ప్రారంభం కానున్నాయి. మార్చి 2021 నుంచి గాంధీ ఆస్పత్రిలో సాధారణ సేవలను నిలిపివేసి.. కరోనా సేవలకు మాత్రమే పరిమితం చేశారు.

Gandhi
Gandhi Hospital : హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో నేటి నుంచి నాన్ కోవిడ్ సేవలు ప్రారంభం కానున్నాయి. మార్చి 2021 నుంచి గాంధీ ఆస్పత్రిలో సాధారణ సేవలను నిలిపివేసి.. కరోనా సేవలకు మాత్రమే పరిమితం చేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కరోనా సేసులు తగ్గడంతో నాన్ కోవిడ్ సేవలను అందుబాబులోకి తీసుకొస్తున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.రాజారావు వెల్లడించారు.
ఆస్పత్రి ప్రధాన భవనాన్ని కోవిడ్ బ్లాక్ గా మార్చారు. ఈ భవనంలోని 2, 3 వ అంతస్తలను కరోనా చికిత్సకు, 4వ అంతస్తులోని ఈఎన్ టీ విభాగాన్ని బ్లాక్ ఫంగస్ బాధితులకు కేటాయించినట్లు తెలిపారు. కరోనా పేవల నేపథ్యంలో ప్రధాన భవనంలోకి సాధారణ రోగులకు అనుమతి ఉండదని పేర్కొన్నారు. ఓపీ బ్లాక్ లో యథావిధిగా కొనసాగుతాయని చెప్పారు.
ఐసీయూ వార్డులో ఎమర్జెన్సీ సేవలు కొనసాగుతాయని తెలిపారు. దశల వారీగా అన్ని రకాల సర్జరీలు నిర్వహిస్తామని వెల్లడించారు. అయితే మాస్కులు ధరించినవారినే అనుమతిస్తామని చెప్పారు.