Jeevanreddy : మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మరో షాక్.. వడ్డీతో సహా రూ.20కోట్లు చెల్లించాలని నోటీసులు
ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. వడ్డీతో సహా రూ.20 కోట్ల రుణాన్ని చెల్లించాలి అంటూ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు.

Jeevanreddy
Armur Jeevanreddy: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. వడ్డీతో సహా రూ.20 కోట్ల రుణాన్ని చెల్లించాలి అంటూ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి అధికారులు నోటీసులు జారీ చేశారు. మామిడిపల్లిలోని జీవన్ రెడ్డి ఇంటికి నోటీసులు అంటించారు. 2017లో తన జీవన్ రెడ్డి భార్య పేరుతో తీసుకున్న లోన్ కు సంబంధించి అసలు వడ్డీతో సహా మొత్తం చెల్లించాలని నోటీసులు ఇచ్చారు. ఇచ్చిన గడువులోగా లోక్ చెల్లించకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని నోటీసులు పేర్కొన్నారు. జీవన్ రెడ్డితో పాటు గ్యారెంటీ సంతకాలు పెట్టిన మరో నలుగురికి కూడా నోటీసులు జారీ చేశారు.
కాగా..ఆర్మూరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తీసుకున్న రూ.20కోట్ల రుపాయలు రుణాన్ని తక్షణం చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. తీసుకున్న అప్పుకు జీవన్ రెడ్డి కనీసం వడ్డీ కూడా చెల్లించడం లేదని..వడ్డీ అసలు సహా మొత్తం చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. తక్షణం రుణం చెల్లించాలని లేదంటే చట్ట ప్రకారం తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు. ఆయన ఇంటి గోడలకు నోటీసులు అంటించారు.
మాజీ డీజీపీ అంజనీకుమార్ పై సస్పెన్షన్ ఎత్తివేత
కాగా.. కొన్ని రోజుల క్రితం జీవన్ రెడ్డి లీజుకు తీసుకున్న ఓ మాల్ కు సంబంధించి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. మాల్ లీజుకు సంబంధించి ఆర్టీసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. రూ.కోట్లలో జీవన్ రెడ్డి బకాయిలు చెల్లించాల్సి ఉందని అధికారులు తెలిపారు.