Online Loan Apps కొత్త కోణం : మన డబ్బే మనకే అప్పు ఇస్తున్న చైనా బ్యాచ్

Online Loan Apps కొత్త కోణం : మన డబ్బే మనకే అప్పు ఇస్తున్న చైనా బ్యాచ్

Updated On : December 28, 2020 / 3:41 PM IST

Online Loan Apps Chaina Batch : Online Loan Apps కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. చైనా బ్యాచ్‌ మన డబ్బు మనకే అప్పుగా ఇస్తున్న విషయం పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. క్రికెట్‌ బెట్టింగ్‌ రూంలో డబ్బు దోచేస్తోంది అక్రమార్కుల ముఠా. ఆ డబ్బునే చైనాకు తరలిస్తున్నాయి ముఠాలు. ఆన్‌లైన్‌ యాప్స్‌ (Online Loan Apps) ద్వారా ఆ డబ్బుని అప్పుగా ఇస్తున్నాయి. చైనా బెట్టింగ్‌ యాప్స్‌పై ఈడీ విచారణ జరుపుతోంది.

చైనీయుల హస్తం :-
ఇన్‌స్టాంట్‌ లోన్‌ యాప్‌ (Online Loan Apps)లతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అక్రమార్కుల భరతం పడుతున్నారు తెలంగాణ పోలీసులు (Telangana Police). ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక చోట్ల తనిఖీలు నిర్వహించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు.. ఈ దందా వెనుక చైనీయుల హస్తాన్ని గుర్తించారు. దీంతో కేంద్రం కూడా ఇప్పుడీ కేసుపై దృష్టి సారించింది. అసలు అక్రమార్కుల గుట్టురట్టు చేసేందుకు ఈడీ (ED)ని రంగంలోకి దింపింది.

ముగ్గురు నిందితులు అరెస్టు :-
ఇన్స్‌టెంట్ పర్సనల్ లోన్‌యాప్స్ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ (rachakonda police commissioner) మహేష్ భగవత్ తెలిపారు. ఉప్పల్‌కు చెందిన బుమన్నా ప్రసాద్ అనే బాధితుడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి పూణేలో జియా లియాంగ్ ఇన్ఫోటెక్ కాల్ సెంటర్‌ను నిర్వహిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశామన్నారు. వీరు 600 మందితో కంపెనీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వారి వద్ద నుంచి 101 ల్యాప్‌టాప్‌లు, 106 సెల్‌ఫోన్లు, సీసీ కెమెరా డీవీడీ డ్రైవ్‌లు సీజ్ చేసినట్లు చెప్పారు.

చైనీయుల హస్తం :-
ఆన్ లైన్ లోన్ యాప్ లపై మరింత లోతైన దర్యాప్తు చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. యాప్ లోన్ దారుణాలకు ఇప్పటికే పలువురు బలయ్యారు. మొత్తం 158 ఆన్ లైన్ లోన్ యాప్స్ ను గూగుల్ ప్లే స్టోర్ (google play store) నుంచి తొలగించాలని గూగుల్ కు తెలంగాణ పోలీసుల లేఖ రాశారు. ఇంటర్నెట్ ప్రోటేకాల్ ద్వారా బాధితులకు టెలీ కాలర్ లు వేధింపులకు గురి చేస్తున్నట్లు సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. కేసు విచారణలో భాగంగా లోన్ రూపంలో ఇస్తున్న 350 అకౌంట్లలో ఉన్న 87 కోట్ల రూపాయలను పోలీసులు ఫ్రీజ్ చేశారు.