YS Sharmila (Photo : Twitter, Google)
YS Sharmila – CM KCR : తెలంగాణ ప్రభుత్వంపై వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శల దాడి కొనసాగుతోంది. మరోసారి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ఘాటు విమర్శలతో విరుచుకుపడ్డారు. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని పెద్ద దొర రెచ్చగొట్టి, నిరుద్యోగుల ప్రాణం తీస్తే.. చదువుకున్నోళ్లందరికీ సర్కారు కొలువులు ఇవ్వలేమని చిన్నదొర చేతులెత్తేసి, నిరుద్యోగులకు శఠగోపం పెట్టారు అని విమర్శించారు.
” కేసీఆర్ కుటుంబానికి పదవులు పోతే, ఆగమేఘాల మీద మళ్లీ పదవులు తెచ్చుకోవచ్చు. స్వరాష్ట్రం కోసం కొట్లాడిన నిరుద్యోగులు మాత్రం తొమ్మిదేళ్లుగా కొలువులు లేక ఆకలితో అలమటించాలా? ఇందుకేనా తెలంగాణ తెచ్చుకున్నది..? ఇందుకేనా 1200 మంది బలిదానాలు చేసుకున్నది..?
కొలువులు ఇవ్వడం చేతకానప్పుడు ఇంటికో ఉద్యోగం అని యువత ప్రాణం తీసిన మీకు ఏ శిక్ష వేయాలి చిన్న దొర? ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేసి, అధికారం అనుభవిస్తూ.. ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వలేం అంటూ చావు కబురు చల్లగా చెప్పేందుకు సిగ్గనిపించడం లేదా కేటీఆర్ గారు.
బిశ్వాల్ కమిటీ లెక్కల ప్రకారం 1.91 లక్షల కొలువులు కూడా ఇవ్వని మీరు చేతకాని వారు. కనీసం స్వయం ఉపాధి కూడా కల్పించలేని దరిద్రపు పాలన మీది. తొమ్మిదేళ్లుగా భర్తీ చేసింది ముష్టి 65వేలు ఉద్యోగాలు. అవి కూడా పేపర్ లీకులు, ప్రశ్నాపత్రాల స్కాములు.
బీసీ, దళిత, గిరిజన బిడ్డలు స్వయం ఉపాధి కోసం 10 లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకుంటే.. ఆ అర్జీలను అటకెక్కించి, నిధులు పక్కదారి పట్టించిన దోపిడీ దొంగలు మీరు. నెలకు రూ.3,016 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి, ఓట్లు దండుకున్న గజ దొంగలు మీరు. తండ్రివి పిట్టల దొర ముచ్చట్లు.. కొడుకువి కల్లబొల్లి, డొల్ల మాటలు. తొమ్మిదేళ్లుగా ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగుల ఉసురు తీసుకుంటున్న మిమ్మల్ని తన్ని తరిమే రోజులు దగ్గర పడ్డాయి” అని ధ్వజమెత్తారు షర్మిల.
తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తదని పెద్ద దొర రెచ్చగొట్టి, నిరుద్యోగుల ప్రాణం తీస్తే..
చదువుకున్నోళ్లందరికీ సర్కారు కొలువులు ఇవ్వలేమని చిన్నదొర చేతులెత్తేసి, నిరుద్యోగులకు శఠగోపం పెట్టాడు.
కేసీఆర్ కుటుంబానికి పదవులు పోతే, ఆగమేఘాల మీద మళ్లీ పదవులు తెచ్చుకోవచ్చు.
స్వరాష్ట్రం…
— YS Sharmila (@realyssharmila) June 9, 2023