OU Students Warning : తెలంగాణలో రాజకీయాలు చేస్తే తరిమికొడతాం… పవన్ కళ్యాణ్ కు ఓయూ విద్యార్థులు సీరియస్ వార్నింగ్

ఓయూ-జేఏసీకి చెందిన విద్యార్థులు తమ చేతుల్లో ‘గో బ్యాక్, పవన్ కళ్యాణ్’ అనే ప్లకార్డులు పట్టుకుని క్యాంపస్‌లో నిరసన తెలిపారు.

OU Students Warning : తెలంగాణలో రాజకీయాలు చేస్తే తరిమికొడతాం… పవన్ కళ్యాణ్ కు ఓయూ విద్యార్థులు సీరియస్ వార్నింగ్

OU students warning Pawan Kalyan

Updated On : November 9, 2023 / 10:56 AM IST

OU Students Warning Pawan Kalyan : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. రాష్ట్రంలో రాజకీయాలు చేయొద్దని పవన్ కళ్యాణ్ ను ఓయూ జేఏసీ హెచ్చరించింది. పవన్ కళ్యాణ్ కు ఓయూ జేఏసీ విద్యార్థులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఓయూ-జేఏసీకి చెందిన విద్యార్థులు తమ చేతుల్లో ‘గో బ్యాక్, పవన్ కళ్యాణ్’ అనే ప్లకార్డులు పట్టుకుని క్యాంపస్‌లో నిరసన తెలిపారు. పవన్ కళ్యాణ్ సీరియస్ రాజకీయ నాయకుడు కాదని, ఆయనకు ప్రజా సమస్యలపై పట్టింపు లేదని విమర్శించారు. పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Pawan Kalyan : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 32 స్థానాల్లో జనసేన పోటీ.. మరో రెండు సీట్లపై బీజేపీతో చర్చలు : పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ ఒక బ్రోకర్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ ఓ ఐటమ్ సాంగ్ చేసే వ్యక్తి అని, ప్రజా సమస్యలపై ఏనాడు పోరాడలేదని మండిపడ్డారు. తెలంగాణలో పవన్ రాజకీయాలు చేయడానికి అనుమతించబోమని స్పష్టం చేశారు. పవన్ ఇక్కడ రాజకీయాలు చేస్తే ఊరుకోమని, తరిమికొడతామని హెచ్చరించారు.

కాగా, తెలంగాణలో నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. జనసేన పార్టీ 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకుంది. కూకట్‌పల్లి, తాండూరు, కోదాడ, నాగర్‌కర్నూల్, ఖమ్మం, కొత్తగూడెం, వైరా (ఎస్టీ), అశ్వారావుపేట (ఎస్టీ) అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టాలని పార్టీ నిర్ణయించింది.