Cow : గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని.. హైదరాబాద్ నుండి తిరుపతికి పాదయాత్ర
గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కోరుతూ హైదరాబాద్ నుండి తిరుపతికి పాదయాత్ర చేపట్టారు. అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు.

Padayatra
cow as a national animal : గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కోరుతూ హైదరాబాద్ నుండి తిరుపతికి పాదయాత్ర చేపట్టారు. అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. 45 మంది గో సేవకులు గోవింద మాల ధరించి హైదరాబాద్ లోని టీటీడీ హిమాయత్ నగర్ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి పాదయాత్ర ద్వారా తిరుపతికి బయల్దేరారు. ఈ పాదయాత్రను శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశ చరిత్ర చాలా గొప్పదన్నారు. దేశ భక్తుల బలిదానంతో మనకు స్వాతంత్ర్యం లభించిందని పేర్కొన్నారు. స్వాతంత్ర్య ఫలాలను ఇప్పటికీ ఆస్వాదించలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆవుకు జాతీయ హోదా ప్రకటించాలంటూ.. పాదయాత్ర చేయడం మంచి పరిణామంగా పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఏళ్ళు గడుస్తున్నా.. గోవుకు జాతీయ హోదా ప్రకటించడంలో ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నారని పేర్కొన్నారు.
స్వాతంత్ర్యం లభించింది పరాయి పాలన పోయిందన్నారు. ఇంకా మన దేశాన్ని మనం పాలించు కొనే మన ధర్మాన్ని, ధైర్యాన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. మనకు దేశభక్తి ఎంత అవసరమో..మన సంస్కృతి సంప్రదాయాలను గౌరవించుకోవడం కొవడం, కాపాడు కోవడం కూడా అంతే అవసరమన్నారు. సకల వసతులు అందుబాటులోకి వచ్చినా.. ఎవరూ శ్రమ పడాలని అనుకోవడం లేదన్నారు. కానీ ఈ సమయంలో గోవుని కాపాడే లక్ష్యంతో హైదరాబాద్ నుంచి తిరుమలకు పాదయాత్ర చేయడం శుభ పరిణామం అన్నారు.