Palvai Sravanthi : ఈటల వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను కొనేవాడు పుట్టలేదు : పాల్వాయి స్రవంతి
బీజేపీకి మునుగోడు ప్రజలు బుద్ధి చెప్పినా మారలేదన్నారు. ఈటెల రాజేందర్ తన రాజకీయ అనుభవాన్ని ఇలాంటి విమర్శలకు ఉపయోగిస్తున్నారని ఎద్దేవా చేశారు.

Palvai Sravanthi
Palvai Sravanthi : కాంగ్రెస్ పార్టీపై ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని పాల్వాయి స్రవంతి తెలిపారు. ఎన్నికలు అయి ఆరు నెలల అయిందన్నారు. ఈటెల రాజేందర్ కాంగ్రెస్ పై చేసిన ఆరోపణలు ఆయన వ్యక్తిగతమా…బీజేపీ పార్టీ చేసిన ఆరోపణలా తెలపాలని డిమాండ్ చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు బీజేపీ చేతిలోనే ఉన్నాయని.. కాంగ్రెస్ కు రూ.25 కోట్లు కేసీఆర్ ఇస్తే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
బీజేపీలో చేరికలు లేక ఈటెల ఆవేదనతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమైందన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో తాను పోటీ చేస్తే తనకు అనేక అవరోధాలు కల్పించారని వాపోయారు. మునుగోడు ఉప ఎన్నికలను కాంగ్రెస్ నేతను కొనుక్కొని బీజేపీ తీసుకువచ్చిందని చెప్పారు. ఈ మేరకు పాల్వాయి స్రవంతి ప్రెస్ మీట్ నిర్వహించారు.
Rahul Gandhi: 18 ఏళ్ల తర్వాత అధికారిక బంగళా ఖాళీ చేసిన రాహుల్ గాంధీ
బీజేపీకి మునుగోడు ప్రజలు బుద్ధి చెప్పినా మారలేదన్నారు. ఈటెల రాజేందర్ తన రాజకీయ అనుభవాన్ని ఇలాంటి విమర్శలకు ఉపయోగిస్తున్నారని ఎద్దేవా చేశారు. తమకు కేసీఆర్ డబ్బులు ఇవ్వలేదు అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయానికి వెళ్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను కొనే వాడు ఇంకా పుట్టలేదన్నారు.
ఆదానీ కుంభకోణాన్ని బయటపెట్టినందుకు రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారని వెల్లడించారు. ఈటల భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయానికి రాకపోతే వారి మానసిక స్థితి బాగోలేక బీజేపీలో ప్రాధాన్యత లేక ఇలాంటి వ్యాఖ్యలు చేశారని భావించాలన్నారు. బీజేపీ నమ్మే భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయానికి ఈటెల రాజేందర్ రావాలని తాము డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు.