Lover Died : భయపడ్డ ప్రేమికుడు.. పారిపోయే క్రమంలో ప్రమాదం.. మృతి

ప్రేమించిన యువతిని తీసుకోని ఇంట్లోంచి వెళ్ళిపోయిన యువకుడిని తిరిగి ఇంటికి తీసుకొస్తుండగా.. భయపడి పారిపోవడానికి ప్రయత్నించాడు. ఇదే సమయంలో బస్సు ఢీకొనడంతో మృతి చెందాడు.

Lover Died : భయపడ్డ ప్రేమికుడు.. పారిపోయే క్రమంలో ప్రమాదం.. మృతి

Lover Died

Updated On : November 20, 2021 / 8:05 AM IST

Lover Died : ఓ బాలికను ప్రేమించిన యువకుడు పెళ్లి చేసుకునేందుకు ఇంట్లోంచి తీసుకెళ్లాడు. తమ కూతురు మిస్ అయిందని బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సదరు యువకుడిపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు పోలీసులు. వారిని గుర్తించి తిరిగి ఇంటికి తీసుకొస్తున్న సమయంలో బస్సు ఢీకొనడంతో యువకుడు మృతి చెందాడు.

చదవండి : Visakha Girl Died : ప్రేమోన్మాది చేతిలో గాయపడిన యువతి మృతి

వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి జిల్లా పాల్వంచకు చెందిన గోవిందు సాయి‌కృష్ణ (21) అనే యువకుడు ఓ బాలికను ప్రేమిస్తున్నాడు. పెళ్లి చేసుకుందామని చెప్పి పదిరోజుల క్రితం బాలికను తీసుకోని ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా తిరుపతిలో ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి వెళ్లారు.

చదవండి : Lovers Suicide : పెళ్లైన ఆటో డ్రైవర్‌తో బాలిక ప్రేమ.. ఆర్టీసీ బస్సులో ఆత్మహత్యాయత్నం

గురు‌వారం వారిని తిరిగి ఇంటికి తీసు‌కొ‌స్తుం‌డగా రేణి‌గుంట వద్దకు రాగానే సాయి‌కృష్ణ మూత్రా‌నికి వెళ్తా‌నని చెప్పి కారు దిగి పారిపోడానికి ప్రయత్నించాడు. ఈ సమయంలోనే వేగంగా వచ్చిన బస్సు సాయికృష్ణని ఢీకొంది. ఈ ప్రమాదంలో అతడికి తీవ్రగాయాలయ్యాయి.. దీంతో అతడిని ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ సాయికృష్ణ మృతి చెందాడు. కుటుంబ సభ్యులు సాయి‌కృష్ణ మృత‌దే‌హాన్ని శుక్ర‌వారం పాల్వం‌చ‌లోని నివా‌సా‌నికి తీసు‌కొ‌చ్చారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.