చంచల్‌గూడ జైలుకు మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహెల్
మితిమీరిన వేగంతో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రజాభవన్ వద్ద రోడ్డు ప్రమాదానికి కారణమైన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహెల్ ను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు.

former MLA Shakeel son Raheel
Ex MLA Shakeel Son Case: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహెల్ అరెస్ట్ అయ్యాడు. ప్రజా భవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో రహెల్ నిందితుడిగా ఉన్నాడు. రోడ్డు ప్రమాదం తరువాత పోలీసులు కేసు నమోదు చేయడంతో రహెల్ దుబాయ్ కు పోరిపోయాడు. అయితే, తన స్థానంలో మరొకరు పోలీసులకు లొంగిపోయేలా చేశాడని ఆరోపణలు వచ్చాయి. రాహెల్ కు ఇప్పటికే పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం హైదరాబాద్ కు వస్తున్న రహెల్ ను శంషాబాద్ విమానాశ్రయం ఇమిగ్రేషన్ అధికారులు ఎయిర్ పోర్టులోనే అదుపులోకి తీసుకొని పంజాగుట్ట పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం పోలీసులు రహెల్ ను అరెస్టు చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు.
రహెల్ కు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపర్చనున్నారు. నాంపల్లికోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ ను విధించింది. దీంతో అతడు ఈనెల 22వ తేదీ వరకు చంచల్ గూడ జైలులో రిమాండ్ ఉండనున్నాడు.