ప్రణీత్ రావు వ్యవహారంలో మరో ట్విస్ట్.. రహస్య ప్రదేశంలో విచారణ చేస్తున్న పోలీసులు

తెలంగాణలో సంచలనం రేపుతున్న మాజీ ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసు వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.

ప్రణీత్ రావు వ్యవహారంలో మరో ట్విస్ట్.. రహస్య ప్రదేశంలో విచారణ చేస్తున్న పోలీసులు

former SIB DSP Praneet Rao

Updated On : March 11, 2024 / 9:33 PM IST

Former DSP Praneet Rao : తెలంగాణలో సంచలనం రేపుతున్న మాజీ ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసు వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నాన్ బెయిలబుల్ కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే, ప్రణీత్ రావును పోలీసులు అదుపులోకి తీసుకొని, ఓ రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు సమాచారం. ప్రణీత్ రావు అరెస్టు వ్యవహారంపై అధికారులు గోప్యత పాటిస్తున్నారు. అతని మొబైల్ రెండు రోజులుగా స్విచ్ ఆఫ్ అయినట్లు గుర్తించారు. సిరిసిల్ల హెడ్ క్వార్టర్ లోని ప్రణీత్ రావు ఇంటికి తాళం వేసి ఉంది. ఇవాళ సాయంత్రం లోగా ప్రణీత్ రావ్ అరెస్టును అధికారులు చూపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విచారణలో భాగంగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇదిలాఉంటే.. ప్రణీత్ రావును సస్పెండ్ చేసిన తరువాత సిరిసిల్ల హెడ్ క్వాటర్ వదిలి వెళ్లొద్దంటూ ఉన్నతాధికారులు ఆదేశించిన విషయం తెలిసిందే. ఎస్ఐబీ అడిషనల్ ఎస్పీ రమేష్ ఫిర్యాదు మేరకు ప్రణీత్ రావుతోపాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. నమ్మక ద్రోహం, నేరపూరిత కుట్ర, అధికార దుర్వినియోగం, సాక్ష్యాధారాలు చెరపటం, డాటా చోరీతో పాటు, పలు ఐటీ యాక్ట్స్ కింద కేసులు నమోదు చేశారు.

Also Read : Prof K Nageshwar’s Analysis : మళ్లీ గెలుస్తామన్న సీఎం జగన్ విశ్వాసానికి కారణం ఏంటి? ప్రొ.నాగేశ్వర్ విశ్లేషణ..

డీఎస్పీ రమేష్ ఫిర్యాదులో ప్రణీత్ రావు వ్యవహారంపై కీలకమైన అంశాలు పేర్కొన్నారు.. ఎస్ఐబీ అనేది ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్‌లోని ఒక ప్రత్యేక సంస్థ. ఇది రాష్ట్ర భద్రత నిఘా సేకరణకోసం ఏర్పాటు చేసింది. ప్రణీత్ రావు 2018 నుండి ఎస్ఐబీలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశాడు. 2023లో డీఎస్పీగా వేగంగా పదోన్నతి పొందాడు. ఎస్ఐబీలో పనిచేస్తూ ఇతర బృందాల మాదిరిగాకాకుండా.. తనకోసం ప్రత్యేకంగా రెండు గదులు ఏర్పాటు చేసుకోవడంతోపాటు.. ఇంటర్నెట్ కనెక్షన్ తో ప్రత్యేకమైన 17 సిస్టమ్ ను ఆపరేట్ చేశాడు. ఎవరికీ తెలియని వ్యక్తుల ప్రొఫైళ్లను తయారు చేసి రహస్యంగా, అనధికారికంగా పర్యవేక్షించాడని డీఎస్పీ రమేష్ ఫిర్యాదులో పేర్కొన్నారు. చట్టవిరుద్దంగా, 2024లో ఎస్ఐబీ కార్యాలయం నుంచి ఎలక్ట్రానిక్ రికార్డులు అదృశ్యమైనట్లుగా నా దృష్టికి వచ్చిందని, విచారణలో ప్రణీత్ కుమార్ తన అధికారిక పదవిని దుర్వినియోగంచేసి కస్టడీలో ఉన్న పెన్ డ్రైవ్, ఎక్స్‌టర్నల్ డేటా వ్యక్తిగత డ్రైవ్‌లలోకి ఇంటెలిజెన్స్ సమాచారాన్ని కాపీ చేసేవాడని డీఎస్పీ రమేష్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

Also Read : Minister Roja : పవన్, లోకేశ్ జీవితంలో ఎమ్మెల్యేలు కాలేరు.. మేమూ బ్లూ బుక్ అని రాసుకొని ఉంటే మీరు రాష్ట్రంలో ఉండేవారా? మంత్రి రోజా

ప్రణీత్ రావు తన నేరపూరిత చర్యల నుంచి రక్షించుకోవడానికి గతేడాది డిసెంబర్ నాలుగో తేదీన రాత్రి డేటా సమాచారం ఉన్న పరికరాలను ధ్వంసం చేశాడని, ఆ సమయంలో సీసీ కెమెరాలను ఆపేశాడని, హార్డ్ డిస్క్ లుసహా సిస్టమ్ లను ద్వంసం చేశాడని, మొత్తం సమాచారాన్ని ధ్వంసం చేసినట్లు డీఎస్పీ రమేష్ తన ఫిర్యాదులో తెలిపాడు. అయితే, ప్రణీత్ రావు వ్యవహారంలో వెలుగులోకి రావడంతో అతన్ని విధుల నుంచి సస్పెండ్ చేసి IPC సెక్షన్ 409. 9,427, 201, 120 (B) , సెక్షన్‌(3) PDPP చట్టం, 1984, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం యొక్క 65, 66. & 70 కింద పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా అతన్ని అదుపులోకి  రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం.