Schools, Colleges Reopen : స్కూళ్లు, కాలేజీలు తెరవటంపై తల్లితండ్రుల్లో ఆందోళన

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుమఖం పట్టటంతో ప్రభుత్వం  నేటి నుంచి లాక్ డౌన్ ఎత్తివేసింది. జులై 1నుంచి క్లాసులు నిర్వహించటానికి అన్నీ సిధ్ధం చేయమని కేబినెట్ విద్యాశాఖ అధికారులకు సూచించింది.

Parents Objection On Schools Repoen

Schools, Colleges Reopen :  తెలంగాణలో కరోనా కేసులు తగ్గుమఖం పట్టటంతో ప్రభుత్వం  నేటి నుంచి లాక్ డౌన్ ఎత్తివేసింది. ప్రజాజీవనం ఇబ్బందులకు గురి కావొద్దని, సామాన్యుల బతుకుదెరువు దెబ్బతినకూడదనే ఉద్దేశంతో లాక్‌డౌన్‌ ఎత్తివేసినట్టు ప్రభుత్వం తెలిపింది. జులై 1నుంచి క్లాసులు నిర్వహించటానికి అన్నీ సిధ్ధం చేయమని కేబినెట్ విద్యాశాఖ అధికారులకు సూచించింది.

పాఠశాలలు పునః ప్రారంభం, ఆన్‌లైన్ క్లాసులు నిర్వహణ, తప్పనిసరిగా హాజరవ్వటం, ఇతర నిబంధనలకు విధి, విధానాలు రూపోందించి త్వరగా విడుదల చేయాలని ప్రభుత్వం విద్యాశాఖను ఆదేశించింది.

లాక్‌డౌన్ ఎత్తేసినంత మాత్రాన కరోనా విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని, మాస్క్ ధరించటం, భౌతిక దూరం పాటించటం, శానిటైజర్ ఉపయోగించటం వంటిని పాటించాలని సూచించింది. అయితే విద్యాసంస్ధలు తెరవటాన్నితల్లితండ్రులు వ్యతిరేకిస్తున్నారు. త్వరలో మూడో వేవ్ కరోనా వస్తుందనే వార్తలు  నేపధ్యంలో ఇప్పట్లో పిల్లల్ని బయటకు పంపించేందుకు సిధ్ధంగా లేమని కొందరు తల్లితండ్రులు తెలిపారు.

మూడో వేవ్‌లో కరోనా పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుందనే వార్తలు వారిలో ఆందోళన కలిగిస్తోంది. విద్యా సంస్ధల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ, పిల్లల భద్రతపై ఇంకా భయాలు ఉన్నాయని హైదరాబాద్ తల్లితండ్రుల సంఘం సభ్యుడొకరు వ్యాఖ్యానించారు. 18 ఏళ్లు దాటిన పిల్లలు ఇంకా పూర్తిస్ధాయిలో వ్యాక్సిన్ వేయించుకోలేదని వారు తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసే మార్గదర్శకాలు కోసం వేచి చూస్తున్నట్లు తల్లితండ్రులు పేర్కోన్నారు. ప్రభుత్వం ఈ విషయమై పునరాలోచించుకోవాలని వారు కోరుతున్నారు.