MLA lockdown rules break : లాక్ డౌన్ రూల్స్ పట్టించుకోని పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి

MLA lockdown rules break : లాక్ డౌన్ రూల్స్ పట్టించుకోని పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి

Mla Lockdown Rules Break

Updated On : May 18, 2021 / 1:09 PM IST

Parigi mla lock down rules break  : వికారాబాద్ పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి లాక్‌డౌన్ నిబంధనలను గాలికొదిలేశారు. దోమ మండల కేంద్రంలో ప్రభుత్వం ఆడపిల్లలకు ఇచ్చే కళ్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేయటానికి రావాల్సి ఉండగా ఉదయం 10.00గంటు దాటినా రాలేదు. తెలంగాణలో లాక్ డౌన్ 10 గంటలు దాటితో లాక్ డౌన్ అమలులోకొస్తుంది. కానీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేయటానికి రావాల్సి ఉండగా 10 గంటలు దాటినా రాకపోయేసరికి ప్రజలు అసంతృప్తి వ్యక్తంచేశారు.

అప్పటికే చెక్కులు పంపిణీ చేసే ప్రాంతానికి భారీగా తరలిచి వచ్చిన లబ్దిదారులు ఎమ్మెల్యే కోసం పడిగాపులు పడి కూర్చున్నారు. ఓ వైపు 10గంటలు దాటిపోతోంది. మళ్లీ లాక్ డౌన్ అమలులోకొస్తుంది. ఇంకా ఎమ్మెల్యే రాలేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ నిబంధనల్ని ప్రజాప్రతినిథులే బేఖాతరు చేస్తే ఎలాగా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఉదయం పది దాటినా కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేయటానికి రాకుండా పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి నిర్లక్ష్యం వహించారు. ఆ తరవాత 10గంటలు దాటిని చాలాసేపటికి వచ్చిన ఎమ్మెల్యే లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మీ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. చెక్కుల కోసం వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, ప్రజలు భారీగా తరలివచ్చి అక్కడ గుమిగూడారు. దీంతో ఎమ్మెల్యే తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.