Weather Report: తెలంగాణలో అక్కడక్కడా మోస్తరు వర్ష సూచన
తెలంగాణ రాష్ట్రంలో రాగాల మూడు రోజుల్లో అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది

Weather
Weather Report: తెలంగాణ రాష్ట్రంలో రాగాల మూడు రోజుల్లో అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శుక్రవారం తూర్పు వీదర్భ మరియు పరిసర ప్రాంతాల నుండి తెలంగాణా మీదగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి సుమారు 0.9కి మి ఎత్తు ఉన్న ఉపరితల ద్రోణి ఈ రోజు బలహీనపడింది. శనివారం ఉపరితల ద్రోణి ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుండి మరట్వాడ మీదగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి సుమారు 1.5 కి మి ఎత్తులో కొనసాగుతుంది.
Also Read: Nalgonda : నల్గొండ సాగర్ ఎడమ కాలువలో దొరకని కారు.. అందులో ఎవరైనా ఉన్నారా ?
ఈప్రభావంతో శని, సోమవారాల్లో తెలంగాణ రాష్ట్రంలోనూ అక్కడక్కడా తేలికపాటి వర్షాలు నమోదు అవుతాయని.. ఆదివారం నాడు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. శనివారం తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర సంచాలకులు వివరించారు. మరోవైపు తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. నడివేసవిని తలపించేలా ఈశాన్య తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని, , ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Also read: Summer : వేసవిలో చర్మాన్ని తేమగా, జిడ్డు లేకుండా ఉంచటమెలా?