Gutha Sukender Reddy : పార్టీ అవకాశం ఇస్తేనే అమిత్ పోటీ.. టికెట్ కోసం పైరవీలు, పాకులాడాడం చేయం : గుత్తా సుఖేందర్ రెడ్డి
రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజం అన్నారు. కొంతమంది విజ్ఞత లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నోటికి అడ్డూ అదుపు లేకుండా వెంకట్ రెడ్డి మాట్లాడుతున్నారని సీరియస్ అయ్యారు.

Gutta Sukhender Reddy (1)
Gutha Sukender Reddy Chit-Chat : నల్గొండ జిల్లా మంత్రికి, తనకు ఎటువంటి భేదాభిప్రాయాలు లేవని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా అధికారిక వ్యవహారాల్లో తాను ఎన్నడూ జోక్యం చేసుకోనని తేల్చి చెప్పారు. ఎవరైనా తన వద్దకు వచ్చినా నిబంధనల ప్రకారం వెళ్లాలని చెబుతానని పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆయన నల్గొండలో మీడియాతో చిట్ చాట్ చేశారు. అధికారికంగా, రాజకీయంగా ఏం జరిగినా సీఎం కేసీఆర్ దృష్టిలో ఉంటుందన్నారు.
అమిత్ కు టికెట్ విషయంలో పార్టీదే తుది నిర్ణయమని తెలిపారు. పార్టీ అవకాశం ఇస్తేనే అమిత్ పోటీ చేస్తారని స్పష్టం చేశారు. టికెట్ కోసం పైరవీలు, పాకులాడాడం చేయబోమని తేల్చి చెప్పారు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజం అన్నారు. కొంతమంది విజ్ఞత లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నోటికి అడ్డూ అదుపు లేకుండా వెంకట్ రెడ్డి మాట్లాడుతున్నారని సీరియస్ అయ్యారు.
తాను భాష ప్రయోగం విషయంలో హుందాగా ఉంటానని తెలిపారు. బురదలో రాయి వేసే అలవాటు తనకు లేదన్నారు. సొంత పార్టీలో అవిశ్వాసాలు మంచి సంప్రదాయం కాదని హితవు పలికారు. వామపక్షాలతో సీట్ల పొత్తు ఖరారు అయ్యాకనే ఉమ్మడి జిల్లాలో అభ్యర్థుల మార్పుపై క్లారిటీ వస్తుందని చెప్పారు. వామపక్షాలు బీఆర్ఎస్ తో పొత్తుకు సుముఖంగా ఉన్నాయని తెలిపారు.
కృష్ణా జలాల పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వ తాత్సారం చేస్తుందని విమర్శించారు. ఎక్కడ పని చేసినా రాజకీయ నాయకులకు, ప్రజా ప్రతినిధులకు ఆత్మవిమర్శ అనేది ఉండాలని సూచించారు.
తాను చేసేదే కరెక్ట్.. తనకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటే బొక్క బోర్లా పడటం ఖాయమన్నారు. తమ పనిని ప్రజలు మెచ్చుతున్నారా? ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? అన్న విషయాలను ప్రజాప్రతినిధులు ఆలోచించాలని తెలిపారు.