Kishan Reddy : 10 లక్షల ఉద్యోగ పోస్టులను భర్తీ చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

అర్హులైన వారికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. రోజ్ గార్ మేళా సందర్భంగా అపాయింట్ మెంట్ ఆర్డర్ తీసుకుంటున్న అందరికీ హృదయపూర్వక వందనాలు తెలిపారు.

Kishan Reddy : 10 లక్షల ఉద్యోగ పోస్టులను భర్తీ చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Kishan Reddy (1)

Updated On : July 22, 2023 / 12:54 PM IST

Secunderabad Rail kala Nilayam : ప్రపంచంలో యూత్ పాపులేషన్ లో భారత్ నెంబర్ వన్ లో ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశంలో పేద ప్రజలకు సేవలు అందించాలన్నదే కేంద్ర ప్రభుత్వం లక్ష్యం అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సంస్థలలో 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడమే కేంద్రం లక్ష్యమని చెప్పారు. ప్రతి నెల 70 నుంచి 8 వేల ఉద్యోగాలు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టార్గెట్ అని పేర్కొన్నారు.

సికింద్రాబాద్ రైల్ కళా నిలయంలో మిషన్ రిక్రూమెంట్ రోజ్ గార్ యోజన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. అర్హులైన వారికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. రోజ్ గార్ మేళా సందర్భంగా అపాయింట్ మెంట్ ఆర్డర్ తీసుకుంటున్న అందరికీ హృదయపూర్వక వందనాలు తెలిపారు. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రుల రికమండేషన్లు లేకుండా ఈ ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు.

YS Viveka Case : వైఎస్ వివేకా హత్య కేసు.. వైఎస్ షర్మిలను సాక్షిగా చేర్చిన సీబీఐ, వాంగ్మూలంలో కీలక విషయాలు వెల్లడి

ఈ ఉద్యోగాల రిక్రూట్ మెంట్ లో ఏలాంటి ఫ్రాడ్ జరగడానికి వీలు లేదన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తండ్రి రైల్వేస్టేషన్లో టి అమ్ముకుని కుటుంబాన్ని నడిపించారని వెల్లడించారు. నరేంద్ర మోదీ టీ కొట్టు నడిపి దేశ ప్రధాని అయ్యారని పేర్కొన్నారు. మన తల్లిదండ్రులు చేస్తున్న వృత్తిని మనం నిర్భయంగా చెప్పుకోవాలి.. కానీ, మొహమాట పడవద్దన్నారు. తాను రైతు కుటుంబం నుంచి వచ్చానని తెలిపారు.  బీజేపీ పార్టీ ఆఫీసులో పని చేశానని గుర్తు చేశారు.

రాజకీయాలలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు తాను కేంద్ర మంత్రి అయ్యానని వెల్లడించారు. తన తల్లిదండ్రులను తాను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయనని చెప్పారు. మీరందరూ నీతివంతంగా ఉద్యోగాలలో పని చేసి.. మీ తల్లిదండ్రులకు, నరేంద్ర మోదీకి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. వైద్య విద్య రంగంలో ప్రతి ఒక్కరికి నైపుణ్యం కల్పించాలన్నారు. దేశంలో పెద్ద పెద్ద కంపెనీలు, సంస్థలు ఉన్నాయని.. యువతకు ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగ అవకాశాలు రావాలని తెలిపారు.