కరోనా వైరస్ ఎఫెక్ట్ : కలెక్టర్ ను కలవడానికి భయపడుతున్న జనం
గబ్బిలాలంటేనే(bats) వణికి పోతున్నారు అక్కడి జనం. అవి నివసించే ప్రాంతాల నుంచి వెళ్లాలన్నా వణికిపోతున్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్(coronavirus)..

గబ్బిలాలంటేనే(bats) వణికి పోతున్నారు అక్కడి జనం. అవి నివసించే ప్రాంతాల నుంచి వెళ్లాలన్నా వణికిపోతున్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్(coronavirus)..
గబ్బిలాలంటేనే(bats) వణికి పోతున్నారు అక్కడి జనం. అవి నివసించే ప్రాంతాల నుంచి వెళ్లాలన్నా వణికిపోతున్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్(coronavirus).. గబ్బిలాలతో కూడా వస్తుందనే ప్రచారం ప్రజలను భయపెడుతోంది. మహబూబ్ నగర్ కలెక్టరేట్ ఆవరణలోని గబ్బిలాలను తరలించి తమ ప్రాణాలు కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మెల్లిగా భారత్ లోనూ ప్రవేశించింది. దీంతో కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ముఖ్యంగా కరోనా వైరస్.. పాములు, గబ్బిలాల నుంచి వచ్చిందని, ఇది గాలిలో చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని వైద్యులు చెబుతున్నారు. దీంతో గబ్బిలాలను చూడగానే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని చెట్లపై ఉన్న వందలాది గబ్బిలాలను చూసి భయపడుతున్నారు.
మహబూబ్ నగర్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న చెట్లపై వందలాది గబ్బిలాలు నివాసముంటున్నాయి. నిత్యం వేల సంఖ్యలో ప్రజలు కలెక్టర్ కార్యాలయానికి వస్తూ ఉంటారు. వారంతా ఈ చెట్ల కిందనే సేద తీరుతుంటారు. అంతేగాక పక్కన పాఠశాల కూడా ఉంది. ఎన్నో ఏళ్లుగా ఈ గబ్బిలాలు చెట్లపై నివాసం ఉంటున్నప్పటికీ ఎవరికీ ఎలాంటి హానీ చేయలేదు. కానీ గబ్బిలాల కారణంగా.. ఎక్కడ వైరస్ సోకుతుందోనని స్థానికులు ఆందోళన పడుతున్నారు.
ప్రస్తుతం సమాజంలో అనేక రకాల జబ్బులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అందుకు దోమలు, కుక్కలు, పందులతో పాటు గబ్బిలాలు కూడా కారణమని, వాటిని వెంటనే నివారించాలని ప్రజా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. జిల్లా అధికారులు వెంటనే చర్యలు తీసుకొని ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని కోరుతున్నారు.
* గబ్బిలాలను చూసి బెంబేలెత్తుతున్న మహబూబ్ నగర్ జనం
* మహబూబ్ నగర్ కలెక్టరేట్ ఆవరణలోని చెట్లపై గబ్బిలాలు
* కరోనా వైరస్ గబ్బిలాలతో కూడా వస్తుందనే ప్రచారంతో భయాలు
* కలెక్టరేట్‌కు నిత్యం వేల సంఖ్యలో ప్రజలు
* ఎవరికీ హానీ చేయని గబ్బిలాలు
* వైరస్ సోకుతుందేమోనని స్థానికుల ఆందోళన
* జబ్బులకు గబ్బిలాలు కూడా కారణమే-ప్రజా సంఘాలు
* పక్కనే స్కూల్ ఉండడంతో భయపడుతున్న ప్రజలు