maoists arrest: మావోయిస్టు కొరియర్‌ల అరెస్టు

కరీంనగర్ జిల్లాలో మావోయిస్టు కొరియర్‌లను మంగళవారం అరెస్టు చేశారు పోలీసులు. రేణిగుంట టోల్‌ప్లాజా సమీపంలో కారులో వెళ్తున్న ఐదుగురు మావోయిస్టు కొరియర్‌లను పోలీసులు పట్టుకున్నారు.

maoists arrest: మావోయిస్టు కొరియర్‌ల అరెస్టు

maoists arrest

Updated On : April 19, 2022 / 6:07 PM IST

maoists arrest: కరీంనగర్ జిల్లాలో మావోయిస్టు కొరియర్‌లను మంగళవారం అరెస్టు చేశారు పోలీసులు. రేణిగుంట టోల్‌ప్లాజా సమీపంలో కారులో వెళ్తున్న ఐదుగురు మావోయిస్టు కొరియర్‌లను పోలీసులు పట్టుకున్నారు. అరెస్టయిన వారిలో సిద్ధిపేట జిల్లా నాగారం గ్రామానికి చెందిన కస్తూరి రాజు అనే వ్యక్తి కూడా ఉన్నాడు.

 

ఈ ఐదుగురు కొరియర్లు చత్తీస్‌ఘడ్ జిల్లా బీజాపూర్ ప్రాంతంలో ఉన్న మావోయిస్టులకు అనుబంధంగా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కొరియర్ల వద్ద భారీగా పేలుడు పదార్థాలు దొరికాయి. కారులో నుంచి జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు 4 సెల్‌ఫోన్లు, నగదు, రెండు వాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.