Mohammad Azharuddin : హెచ్‌సీఏ ప్రెసిడెంట్ అజారుద్దీన్‌పై పోలీసులకు ఫిర్యాదు, క్రిమినల్ కేసు పెట్టాలని సీపీకి రిక్వెస్ట్

హెచ్‌సీఏ ప్రెసిడెంట్ అజారుద్దీన్‌ పై రాచకొండ పోలీసులకు ఫిర్యాదు అందింది. సెప్టెంబర్ 26 తోనే అజారుద్దీన్ పదవీ కాలం ముగిసినప్పటికీ, తప్పుడు పత్రాలతో బీసీసీఐని మోసం చేశారంటూ..

Mohammad Azharuddin : హెచ్‌సీఏ ప్రెసిడెంట్ అజారుద్దీన్‌పై పోలీసులకు ఫిర్యాదు, క్రిమినల్ కేసు పెట్టాలని సీపీకి రిక్వెస్ట్

Updated On : October 10, 2022 / 4:37 PM IST

Mohammad Azharuddin : హెచ్‌సీఏ ప్రెసిడెంట్ అజారుద్దీన్‌ పై రాచకొండ పోలీసులకు ఫిర్యాదు అందింది. సెప్టెంబర్ 26 తోనే అజారుద్దీన్ పదవీ కాలం ముగిసినప్పటికీ, తప్పుడు పత్రాలతో బీసీసీఐని మోసం చేశారంటూ హెచ్‌సీఏ మాజీ సెక్రటరీ శేషు నారాయణ, ఏసీ మెంబర్ శ్రీధర్ బాబు కలిసి రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ కు ఫిర్యాదు చేశారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఈ నెల 18న జరగబోయే బీసీసీఐ జనరల్ బాడీ మీటింగ్ కు హాజరయ్యేందుకు ఎవరినీ సంప్రదించకుండా అజారుద్దీన్ తన పదవీ కాలాన్ని పొడిగించుకుంటూ ఉత్తర్వులు జారీ చేశారని ఆరోపించారు. అజారుద్దీన్ పై క్రిమినల్ కేసు పెట్టాలని, తగిన చర్యలు తీసుకోవాలని రాచకొండ సీపీకి విజ్ఞప్తి చేశారు.