Bjp
Police intercepted BJP agitation : హైదరాబాద్ బన్సీలాల్ పేటలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బీజేపీ ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులతో బీజేపీ కార్యకర్తలు గొడవకు దిగారు. టీఆర్ఎస్ రాజ్యాంగాన్ని అవమానించిందంటూ ఆందోళన చేస్తున్న బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో పోలీసులు, బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక కాసేపట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పాల్గొనున్నారు. రాజ్యాగాన్ని మార్చాలని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగుతోంది. కేసీఆర్ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి.
Gold Seized : శంషాబాద్ ఎయిర్ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారం సీజ్
ఇదే అంశంపై బీజేపీ నేతలు సీఎం కేసీఆర్ టార్గెట్ చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ బన్సిలాల్ పేటలో బీజేపీ కార్యకర్తలు ఆందోలనకు దిగారు.