Bhupalpally : ప్రమాదానికి గురైన పోలీస్ వాహనం.. ఏఎస్ఐ మృతి

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఘనపురం మండలం గాంధీనగరం వద్ద ఆగి ఉన్న ఇసుక లారీని పోలీస్ పెట్రోలింగ్ వాహనం వేగంగా ఢీకొంది.

Bhupalpally : ప్రమాదానికి గురైన పోలీస్ వాహనం.. ఏఎస్ఐ మృతి

Bhupalpally

Updated On : November 7, 2021 / 2:02 PM IST

Bhupalpally జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఘనపురం మండలం గాంధీనగరం వద్ద ఆగి ఉన్న ఇసుక లారీని పోలీస్ పెట్రోలింగ్ వాహనం వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఏఎస్ఐతోపాటు వాహనంలో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లకు తీర్వ గాయాలయ్యాయి.

చదవండి : Anantapur Accident : అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

స్థానికులు ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. ఏఎస్ఐ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏఎస్ఐ హరిలాల్ ప్రాణాలు విడిచారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక నిర్దారణకు వచ్చారు.

చదవండి : Panjab Police : పంజాబ్ సరిహద్దులో టిఫిన్ బాంబు స్వాధీనం