హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. పబ్‌పై నార్కోటిక్ బ్యూరో దాడులు.. 24మందికి పాజిటివ్
డ్రగ్స్ తో పట్టుబడిన వారిలో పబ్ నిర్వాహకులు, డిజె ఆపరేటర్లు ఉన్నారు. పబ్ లో గంజాయి, ఇతర మత్తు పదార్థాలు సేవించిన ఆనవాళ్లను ..

police Raid on pub
Drug Test in Hyderabad : హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం రేపింది. నగరంలోని మణికొండ పరిధిలోని ‘దీ కేవ్ పబ్’ పై పోలీసులు, నార్కొటిక్ బ్యూరో అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో డ్రగ్స్ తీసుకున్నట్లు అనుమానంఉన్న 55మందికి టెస్టులు చేశారు. వీరిలో 24మందికి పాజిటివ్ రావడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
Also Read : ధోనీ పుట్టినరోజు వేడుకల్లో భార్య సాక్షి ఏం చేసిందో చూశారా.. వీడియో వైరల్
డ్రగ్స్ తో పట్టుబడిన వారిలో పబ్ నిర్వాహకులు, డిజె ఆపరేటర్లు ఉన్నారు. పబ్ లో గంజాయి, ఇతర మత్తు పదార్థాలు సేవించిన ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. తాము దాడులు చేసిన సమయంలో పబ్ లో ఉన్న 55 మందికి డ్రగ్స్ టెస్టులు నిర్వహించామని పోలీసులు తెలిపారు. డ్రగ్స్ తీసుకున్నట్లు తేలిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.