Police Raides : భైంసాలో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత.. బీజేపీ అభ్యర్థి బంధువు ఇంట్లో ఎఫ్ ఎస్టీ టీమ్ తో పోలీసుల సోదాలు
పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. దీంతో పలువురు పోలీసులకు, కార్యకర్తలకు గాయాలు అయ్యాయి.

Bhainsa Tension
Police Raides In Bhainsa : నిర్మల్ జిల్లాలోని భైంసాలో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్ బంధువు ఇంట్లో ఎఫ్ ఎస్టీ టీమ్ తో పోలీసుల సోదాలు చేశారు. దీంతో బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. దీంతో పలువురు పోలీసులకు, కార్యకర్తలకు గాయాలు అయ్యాయి.
పలు కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. పోలీసులు అక్కడి నుంచి ఆందోళనకారులను చెదరగొట్టారు. పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. దీంతో భైంసాలో తీవ్ర ఉత్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.