Jubilee Hills Girl Rape : జూబ్లీహిల్స్‌ గ్యాంగ్ రేప్ కేసు..ఇవాళ బాధిత బాలిక స్టేట్‌మెంట్‌ రికార్డు

బయటకు వచ్చిన వీడియోల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోక్సో చట్ట ప్రకారం బాధితురాలి స్టేట్‌మెంట్‌ ను పోలీసులు ఫైనల్‌ చేయనున్నారు.

Jubilee Hills Girl Rape : జూబ్లీహిల్స్‌ గ్యాంగ్ రేప్ కేసు..ఇవాళ బాధిత బాలిక స్టేట్‌మెంట్‌ రికార్డు

Police Investigation 11zon

Updated On : June 6, 2022 / 10:01 AM IST

Jubilee Hills girl rape : జూబ్లీహిల్స్‌ ఆమ్నేషియా పబ్‌ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. గ్యాంగ్ రేప్ కేసులో బాధిత బాలిక స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేయనున్నారు. స్టేట్‌మెంట్‌ ఆధారంగా ఎమ్మెల్యే కొడుకుపై కేసు నమోదుకు సన్నాహాలు చేస్తున్నారు. A-6గా ఎమ్మెల్యే కొడుకు పేరు నమోదయ్యే అవకాశం ఉంది. బయటకు వచ్చిన వీడియోల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోక్సో చట్ట ప్రకారం బాధితురాలి స్టేట్‌మెంట్‌ ను పోలీసులు ఫైనల్‌ చేయనున్నారు.

మరోవైపు ఓ ఎంఐఎం కార్పొరేటర్‌ను పోలీసులు విచారించనున్నారు. ఇవాళ విచారణకు రావాలని కార్పొరేటర్‌కు పోలీసులు నోటీసులు పంపారు. నిందితులకు కార్పొరేటర్‌ సహకరించాడనే ఆరోపణలున్నాయి. నిందితులతో పాటు కారులో మొయినాబాద్ వరకూ కార్పొరేటర్ వెళ్లినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అతడిని విచారించేందుకు పోలీసులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. నిన్న ఆమ్నేషియా పబ్‌ సిబ్బందిని పోలీసులు స్టేషన్‌కు పిలిచి విచారించారు. మే 28న ఏం జరిగిందనే విషయంపై ఆరా తీశారు. పబ్‌ సిబ్బంది స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు.

Jubilee Hills Girl Rape : జూబ్లీహిల్స్‌ బాలిక గ్యాంగ్‌ రేప్‌ కేసులో కీలక ఆధారాలు సేకరణ

జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌ రేప్‌ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులు ఉపయోగించిన బెంజ్‌, ఇన్నోవా కార్లలో ఫోరెన్సిక్‌ క్లూస్‌ టీమ్‌ ఆధారాలను సేకరించింది. ఇన్నోవా కారులో నిందితుల వీర్య నమూనాలను ఫోరెన్సిక్‌ బృందం గుర్తించింది. రెండు కార్లలో బాలిక వెంట్రుకలను గుర్తించిన ఫోరెన్సిక్‌ బృందం.. నమూనాలను ఎఫ్‌ఎస్‌ఎల్‌కి పంపించింది. అలాగే ఫింగర్‌ ప్రింట్స్‌తో పాటు.. ఓ కారులో దొరికిన బాలిక కాలి చెప్పు.. చెవి రింగును క్లూస్‌ టీమ్‌ గుర్తించింది. కార్లలో దొరికిన ఆధారాలను క్లూస్‌ టీమ్‌ వేర్వేరు కవర్లలో సీజ్‌ చేసింది.

ఘటన జరిగిన ఐదు రోజులు తర్వాత ఇన్నోవా కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇన్నోవా కారులో ఆనవాళ్లు, ఆధారాలు చెరిపివేసే క్రమంలో నిందితులు వాహనం చిక్కకుండా మెయినాబాద్‌లోని ఓ రాజకీయనేత ఫామ్‌హౌస్‌ వెనుక దాచారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కారు టీఆర్ నెంబర్ కూడా గుర్తు పట్టకుండా చేసినట్టు తెలుస్తోంది.