Ponguleti Srinivas Reddy : కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. కేసీఆర్ దోచుకున్న ప్రతీ పైసా వడ్డీతో సహా కక్కిస్తాం : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

కేసీఆర్ దొంగ నిరాహార ధీక్షలతో తెలంగాణ రాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం ఇవ్వాలనుకుంది.. ఇచ్చిందన్నారు. యూనివర్సిటీ విద్యార్థుల భయంతో కేసీఆర్ దీక్ష చేశారని తెలిపారు.

Ponguleti Srinivasa Reddy

Ponguleti Srinivas Reddy Criticizes KCR : తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా.. తెలంగాణ ఆకాంక్ష నెరవేరలేదని టీపీసీసీ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కేసీఆర్ కు స్కీంలు లాంచ్ చేయడం తప్ప వాటిని అమలు చేయడం తెలియదని విమర్శించారు. ఉచిత కరెంటును వాళ్లే కనుగొన్నట్లు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారని పేర్కొన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకుంటే.. ఇప్పటి బీఆర్ఎస్ నేతలు ఎక్కడ ఉండే వారని ప్రశ్నించారు.

మంగళవారం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గాంధీభవన్ వచ్చారు. కాంగ్రెస్ లో చేరిన తర్వాత మొదటిసారి ఆయన గాంధీభవన్ కు వచ్చారు. గాంధీభవన్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పొంగులేటి మర్యాదపూర్వకంగా కలిశారు. జూలై2న ఖమ్మంలో జనగర్జన సభలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవలే పొంగులేటిని ప్రచార కమిటీ కో ఛైర్మన్ గా కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఈ సందర్భంగా పొంగులేటి మీడియాతో మాట్లాడారు.

K. Narayana : పవన్ కళ్యాణ్ ఎన్డీఎతో కలవడం.. బీజేపీతో చేతులు కలపడం ప్రజాస్వామ్యం, లౌకిక వాదానికి ప్రమాదకరం : కె.నారాయణ

కేసీఆర్ దొంగ నిరాహార ధీక్షలతో తెలంగాణ రాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం ఇవ్వాలనుకుంది.. ఇచ్చిందన్నారు. యూనివర్సిటీ విద్యార్థుల భయంతో కేసీఆర్ దీక్ష చేశారని తెలిపారు. ధనిక రాష్ట్రంను అప్పుల రాష్ట్రంగా మార్చింది కేసీఆర్ కాదా అని నిలదీశారు. తెలంగాణకు అప్పు మిగిలింది.. కేసీఆర్ కుటుంబానికి డబ్బు మిగిలింది అని విమర్శించారు.

ఆచరణకు సాధ్యం అయ్యే హామీలనే కాంగ్రెస్ ఇస్తుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. కేసీఆర్ దోచుకున్న ప్రతీ పైసాను వడ్డీతో సహా కక్కిస్తామని పేర్కొన్నారు. తాను 20 గుంటల భూమి కబ్జా చేశానంటే ఎవరైనా నమ్ముతారా అని అన్నారు. తనపై బురదజల్లే ప్రయత్నం జరుగుతుందని వాపోయారు. తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించానని తెలిపారు. తాను కబ్జా చేసినట్లు తెలితే.. తన భూమి మొత్తం రాసిస్తానని సవాల్ చేశారు.

Jagga Reddy – Raghunandan: జగ్గారెడ్డి, రఘునందన్‌రావు మౌనం.. అసంతృప్తిగా ఉన్నారంటూ ప్రచారం

యస్ ఆర్ గార్డెన్ పడగొట్టాలని చూశారని పేర్కొన్నారు. యస్ ఆర్ గార్డెన్ నిర్మించి 13 సంవత్సరాలు అయింది.. అప్పుడే ఎందుకు సర్వే చేయలేదని ప్రశ్నించారు. రాజకీయ కక్ష్య సాధింపులకు బీఆర్ఎస్ దిగుతుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఒకలా.. పార్టీ మారాక ఇప్పుడు మరోలా ఉంటుందా అని నిలదీశారు.

కాంగ్రెస్ పై విమర్శల దాడి పెరిగిందంటేనే.. కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని అర్థం అయిందన్నారు. వర్షం కారణంగా కొల్లాపూర్ సభ వాయిదా పడిందని..మళ్లీ జులై చివరలో సభ ఉంటుందని తెలిపారు. తనకు ప్రచార కమిటీ కో ఛైర్మన్ పదవి ఇచ్చినందుకు పార్టీ నేతలందరికి కృతజ్ఞతలు తెలిపారు. సీనియర్లందరినీ కలుపుకుని పోయి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు.