Ponnam Prabhakar: ప్రతిపక్షాలు ఇచ్చింది చార్జిషీట్ కాదు రిప్రజెంటేషన్: మంత్రి పొన్నం ప్రభాకర్ 

బీజేపీ, బీఆర్ఎస్‌ ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నారని, తెలంగాణ ప్రజలు గమనించాలని పొన్నం ప్రభాకర్‌ పిలుపునిచ్చారు.

Ponnam Prabhakar: ప్రతిపక్షాలు ఇచ్చింది చార్జిషీట్ కాదు రిప్రజెంటేషన్: మంత్రి పొన్నం ప్రభాకర్ 

Minister Ponnam Prabhakar

Updated On : December 8, 2024 / 3:56 PM IST

ప్రతిపక్షాలు ఇచ్చింది చార్జిషీట్ కాదని, రిప్రజెంటేషన్ గా భావిస్తున్నామని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇవాళ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్ఎస్ వేరు కాదని చెప్పారు. వాళ్లు ఇచ్చిన ప్రజెంటేషన్ చార్జిషీట్ ను తమకు ఇచ్చిన రిప్రజెంటేషన్ గా భావించి వాటిని కూడా పరిశీలిస్తామని తెలిపారు.

కానీ, ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెల నుంచే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మళ్లీ సంవత్సరం కాగానే చార్జిషీట్ అని ఇస్తే ఇది భావ్యం కాదని పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన నెలకు ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది అన్నారని, శాపనార్థాలు పెట్టారని తెలిపారు. ప్రభుత్వాన్ని కూల గొడతామన్నారని చెప్పారు.

బీజేపీ, బీఆర్ఎస్‌ ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నారని, తెలంగాణ ప్రజలు గమనించాలని పొన్నం ప్రభాకర్‌ పిలుపునిచ్చారు. తప్పకుండా వాళ్లు ఇచ్చిన చార్జిషీట్ అంశాలు, ప్రజలకు సంబంధించిన అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు. ప్రతిపక్షాలు చెప్పిన అంశాలను పరిశీలించి సరైన నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

ఈ విషయంపై జగన్ ఏనాడూ నోరు మెదపలేదు: నిమ్మల రామానాయుడు