Ponnam Prabhakar: రాష్ట్రంలో అన్ని శాఖలను బీఆర్ఎస్ ఇలా మార్చేసింది: మంత్రి పొన్నం ప్రభాకర్

అయినప్పటికీ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను తాము నెరవేర్చుతామని పొన్నం ప్రభాకర్ చెప్పారు.

Minister Ponnam Prabhakar

Telangana: తెలంగాణలో అన్ని ప్రభుత్వ శాఖలనూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల కుప్పలా మార్చిందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను తాము నెరవేర్చుతామని చెప్పారు.

ఆర్థికంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఏ గ్యారంటీలూ ఆగవని హామీ ఇస్తున్నామని పొన్నం ప్రభాకర్ చెప్పారు. కరీంనగర్ లో పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. తాను కరీంనగర్ బిడ్డనని ఆయన అన్నారు. ఇక్కడి ప్రజల సహకారం, ఆశీర్వాదంతోనే తనకు గొప్ప అవకాశాలు దక్కాయని చెప్పారు.

తాము అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే రెండు గ్యారంటీల అమలును ప్రారంభించామని పొన్నం ప్రభాకర్ అన్నారు. మిగిలిన గ్యారంటీలనూ అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు. తమ ప్రభుత్వాన్ని కూలుస్తామంటూ కడియం శ్రీహరి వంటివారు మాట్లాడుతున్నారని అన్నారు. తాను పార్టీ మారతానని కొన్ని వారాల క్రితం కొందరు ప్రచారం చేశారని చెప్పారు.

Dharani Portal : ధరణి పోర్టల్‌పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష, కీలక ఆదేశాలు జారీ