Property tax: పౌల్ట్రీ.. డైరీలకు ఆస్తి పన్ను మినహాయింపు

కొవిడ్ సంక్షోభంలో పెద్ద ఉపశమనం ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పౌల్ట్రీ, డైరీ యూనిట్లకు ఆస్తి పన్ను నుంచి మినహాయింపు ప్రకటించింది. పంచాయత్ రాజ్ సెక్రటరీ సందీప్...

Property tax: పౌల్ట్రీ.. డైరీలకు ఆస్తి పన్ను మినహాయింపు

Poultry Diary Forms

Updated On : June 2, 2021 / 7:55 PM IST

Property tax: కొవిడ్ సంక్షోభంలో పెద్ద ఉపశమనం ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పౌల్ట్రీ, డైరీ యూనిట్లకు ఆస్తి పన్ను నుంచి మినహాయింపు ప్రకటించింది. పంచాయత్ రాజ్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానా ఈ మేరకు ఆదేశాలు జారీ చేసి బుధవారం నుంచే అమల్లోకి వస్తాయని చెప్పారు.

కాకపోతే సంవత్సరానికి నామినల్ ట్యాక్స్ కింద ప్రతీ యూనిట్ నుంచి రూ.100 మాత్రమే గ్రామ పంచాయతీలు వసూలు చేస్తాయని అది కూడా ఆస్తి వివరాలు మెయింటైన్ చేయడం కోసమేనని వివరించారు.

తెలంగాణ‌లో జూన్ 11 నుంచి భూముల డిజిట‌ల్ స‌ర్వే చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని 27 గ్రామాలను ఎంపిక చేసి ఆ గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద భూముల డిజిటల్ సర్వే చేపట్టాలని ఆదేశించారు. దీంట్లో భాగంగా ముందుగా వ్యవసాయం భూములు ఆ తరువాత పట్టణ ప్రాంతాల్లోని భూముల్ని సర్వే చేయాలని తెలిపారు.