కరోనా అంటే భయం వద్దు..ఇలా చేయండి చాలు

  • Published By: madhu ,Published On : March 28, 2020 / 10:51 AM IST
కరోనా అంటే భయం వద్దు..ఇలా చేయండి చాలు

Updated On : March 28, 2020 / 10:51 AM IST

కరోనా అంటే భయం వద్దు..గియం వద్దు అంటున్నారు సైక్రియాటిస్టులు. కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండాలంటే సోషల్ డిస్టెన్స్ పాటించడం, ఇళ్లలోనే ఉండడం వల్ల వైరస్ వ్యాప్తి చెందకుండా..రాకుండా ఉంటుందని తెలిపారు. కానీ కొన్ని టెక్నిక్స్ ఫాలో అయితే..చాలు అని అంటున్నారు ప్రముఖ సైక్రియాటిస్టు డా. జాన్ హేమంత్. కరోనా వైరస్ నేపథ్యంలో..10tv నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 

ఇంట్లోనే ఉంటూ..సింపుల్ గేమ్స్, ఆటలు తదితర పనులు చేయాలంటున్నారు. లాక్ డౌన్ తప్పదని, ఈ సమయంలో ఏవోవే వార్తలు, ఎన్నో సమాచారాలు వస్తుంటాయి..దీనిని చూసి ఆందోళన చెంద వద్దంటున్నారు. పాజిటివ్ గా థింకింగ్ చేయాలని సూచిస్తున్నారు. ఏదో సమాచారాన్ని మెదడులో పెట్టుకుని టెన్షన్ పెట్టుకోవడం వేస్ట్ అని, ఒక ప్రశాంతమైన వాతావరణం క్రియేట్ చేసుకోవాలి..బద్ధకం వీడాలన్నారు.

వీటిని దాటి ముందుకెళ్లాల్సిందేనని తెలిపారు. మెడిటేషన్ చాలా ప్రధానమైందని, ఆలోచన మెయిన్ అన్నారు. ఒక గంట పాటు సైలెన్స్ గా ఉండే ప్రయత్నం చేయాలి..ఇలా ప్రతి రోజు చేస్తే..మానసికంగా ధృడంగా ఉంటారని, భయం మందులపై కూడా ప్రభావితం చూపెడుతుందన్నారు. శరీరం ఏ స్పీడ్ లో పనిచేస్తుందో..దానికి మనస్సు 12 నుంచి 17 రెట్లు పని చేస్తుందన్నారు.

శరీరం రియాక్ట్ కాకముందే..మనస్సు ముందే చెప్పేస్తుందని, 21 రోజుల పాటు లాక్ డౌన్ అంట..అయ్యో అది దొరకదు..ఇది దొరకదు..అంటూ ఏదో ఆలోచించడం వల్ల మొత్తం పాజిటివ్ గా మారిపోతుందన్నారు. రిలాక్స్ అయ్యే సమయంలో మరింత టెన్షన్ పెట్టే విధంగా చేయవద్దన్నారు.

పుస్తకాలు చదవడం, చిన్న నాటి ఫొటోలు చూడడం, మంచి మెసేజ్ ఇచ్చే సినిమాలు, హస్యపు సన్నివేశాలు చూడడం వంటివి చేయాలన్నారు. లాఫింగ్ క్లబ్ లాగా ఏదో ఒక విధంగా ఇతరులతో రియాక్ట్ కావడం (సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ) వల్ల సమస్య చాలా వరకు తీరే అవకాశం ఉందన్నారాయన.