మొబైల్‌ టాయిలెట్స్ కు క్యూఆర్‌ కోడ్‌

మొబైల్‌ టాయిలెట్స్ కు క్యూఆర్‌ కోడ్‌

Updated On : January 3, 2021 / 9:15 AM IST

QR code for mobile toilets in hyderabad : స్వచ్ఛ హైదరాబాద్‌ లక్ష్యంగా నగరంలో ఏర్పాటు చేసిన మొబైల్‌ టాయిలెట్ల పరిశుభ్రతను జీహెచ్ఎంసీ అధికారులు ఆన్‌లైన్‌లో పర్యవేక్షించనున్నారు. ప్రతి టాయిలెట్‌పై క్యూఆర్‌ కోడ్‌ను అమర్చారు. వీటిని వినియోగించుకున్న వారు నిర్వహణ తీరుతెన్నులను స్మార్ట్‌ఫోన్‌లో కోడ్‌ను స్కాన్‌ చేసి ఫీడ్‌బ్యాక్‌ పంపించవచ్చు.

టాయిలెట్ల నిర్వహణను సంబంధిత సంస్థలకు అప్పగించిన అధికారులు వాటిని ఆన్‌లైన్‌లో పరిశీలించనున్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా టాయిలెట్లను నిత్యం శుభ్రపరిచి క్యూర్‌ కోడ్‌ ద్వారా అధికారులకు నివేదించాల్సి ఉంటుంది.