సమావేశంలో వారందరూ ఎక్కడా? అంటూ అలిగి వెళ్లిపోయిన ఖమ్మం ఎంపీ.. ఏం జరిగిందంటే?
అభివృద్ధికి సంబంధించి ఆ సమావేశంలో ఎన్నో విషయాలు చర్చించాలని ఆయన భావిస్తే అక్కడకు రావాల్సిన వారు రాలేదు.
Raghuram Reddy: సమావేశానికి వచ్చి, అక్కడి పరిస్థితిని చూసి అలిగి వెళ్లిపోయారు ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి. ఇవాళ ఖమ్మంలో రఘురాంరెడ్డి అధ్యక్షతన జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం జరగాల్సి ఉంది.
కలెక్టరేట్ సమావేశ మందిరంలో అన్ని ఏర్పాటు పూర్తయి చర్చలు మొదలు కావాల్సిన సమయంలో అక్కడకు రఘురాంరెడ్డి వచ్చారు. అభివృద్ధికి సంబంధించి ఆ సమావేశంలో ఎన్నో విషయాలు చర్చించాలని ఆయన భావిస్తే అక్కడకు రావాల్సిన వారు రాలేదు.
Also Read: అరె భలే ఉందే.. ఢిల్లీలో కృత్రిమ వాన కురిపించడానికి ఏం చేస్తున్నారో చూడండి..
ఎమ్మెల్యేలు, కలెక్టర్, అధికారులు ఎవరూ అక్కడ కనపడకపోవడంతో రఘురాంరెడ్డికి కోపం వచ్చింది. సమావేశానికి రావాల్సి ఉన్నప్పటికీ వారు రాకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తూ, అలిగి అక్కడి నుంచి రఘురాంరెడ్డి వెళ్లిపోయారు.
