బిగ్‌ అలర్ట్‌.. 5 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

ఈదురు గాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

బిగ్‌ అలర్ట్‌.. 5 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

Rains

Updated On : April 27, 2025 / 4:03 PM IST

ఎండలతో ఉక్కపోతతో సతమతమవుతున్న తెలంగాణ ప్రజలకు కొన్ని రోజుల పాటు ఉపశమనం దొరకనుంది. ఇవాళ వాతావరణం చల్లబడింది. అలాగే, తెలంగాణలో 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 40-50 కి.మీ)తో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పారు.

Also Read: అంతర్జాతీయ క్రికెట్‌లోకి మన తెలుగమ్మాయి ఆరంగేట్రం.. మారుమూల గ్రామం నుంచి మొదలైన ఆమె జర్నీ.. ఇప్పుడు..

రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో రెండు రోజుల పాటు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

రెండు రోజుల తర్వాత ఉరుములు, మెరుపులు, ఈదురు గాలుల (గాలి వేగం గంటకు 30-40 కి.మీ)తో కూడిన వర్షాలు కురుస్తాయి. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.