Rains : తెలంగాణలో మూడు రోజులు వర్షాలు
తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ అండమాన్ సముద్ర పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం కొనసాగుతుందని తెలిపింది.

Rains
Rains in Telangana : తెలంగాణలో మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ అండమాన్ సముద్ర పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం కొనసాగుతుందని తెలిపింది. సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఉందని.. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి రాష్ట్రంలోకి కిందిస్థాయి గాలులు వీస్తున్నాయని పేర్కొంది.
వీటి ప్రభావంతో ఆది, సోమ వారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మంగళవారం అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గత 24 గంటల్లో రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాలతో పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి.
Chandrababu : ఎల్లుండి నుండి చంద్రబాబు వరద ప్రాంతాల పర్యటన
మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రభుత్వం లెక్కల ప్రకారం… రాష్ట్ర వ్యాప్తంగా వరదల వల్ల 24 మంది మృత్యువాత పడ్డారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
వేలాదిగా మూగజీవాలు ప్రాణాలు కోల్పోయాయి. పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వేలాది ఎకరాల్లో పంట నీటి మునిగింది. రవాణా వ్యవస్థ స్థంభించింది. భారీ వర్షాలకు తిరుమల, తిరుపతి అల్లకల్లోలం అయింది. వరదలతో టీటీడీకీ భారీ నష్టం వాటిల్లింది.