Chandrababu : ఎల్లుండి నుండి చంద్రబాబు వరద ప్రాంతాల పర్యటన

టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు ఎల్లుండి (మంగళవారం) నుండి వరద ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఎల్లుండి ఉదయం కడపలో, మధ్యాన్నం నుండి తిరుపతిలో పర్యటించనున్నారు.

Chandrababu : ఎల్లుండి నుండి చంద్రబాబు వరద ప్రాంతాల పర్యటన

Chandrababu (1)

Chandrababu flood-hit areas tour : టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు ఎల్లుండి (మంగళవారం) నుండి వరద ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఎల్లుండి ఉదయం కడపలో, మధ్యాన్నం నుండి తిరుపతిలో పర్యటించనున్నారు. ఆ మరుసటి రోజు బుధవారం నెల్లూరులో చంద్రబాబు పర్యటించనున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించనున్నారు. వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆయన పరామర్శించనున్నారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితులపై నిన్న చంద్రబాబు టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాయలసీమ జిల్లాలు సహా నెల్లూరులోని పలు ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయని తెలిపారు. ఈ విపత్కర సమయంలో వరద బాధితులకు టీడీపీ శ్రేణులు అండగా నిలవాలని సూచించారు. వరద బాధితులకు ఆహారం, మందులు అందేలా చూడాలన్నారు.

Jai Bheem : పాత్ర కోసం ఎలుక మాంసం కూడా తిన్నాను : జై భీమ్ సినతల్లి

చిన్నపిల్లలకు పాలు, బిస్కెట్లు అందించాలని సూచించారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌తో సమన్వయం చేసుకుని ఐటీడీపీ ద్వారా ఇప్పటికే ఆహారం, మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. టీడీపీ నేతలు వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించాలని చంద్రబాబుకు సూచనలు చేశారు. అలాగే వరద బాధితులకు టీడీపీ శ్రేణులు సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం, ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాయలసీమ జిల్లాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలు కాలనీలు నీట మునిగాయి.

Fire Accident : పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు

తిరుపతిలో మునుపెన్నడూ లేని విధంగా వరదలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా తిరుమల కొండచరియలు విరిగి ఘాట్‌ రోడ్డుపై పడిపోయాయి. దీంతో రాకపోకలలకు తీవ్ర అంతరాయం కలిగింది. అంతేకాకుండా మెట్టుమార్గంలో చెట్లు, వరద నీటితో అస్థవ్యస్థంగా తయారైంది. తిరుమల కొండలపైనుంచి వస్తున్న వాన నీటితో కపిలతీర్ధంలో మండపం కూలిపోయింది.