Telangana Rains : తెలంగాణలో రెండు రోజులపాటు వర్షాలు

తెలంగాణలో మరోసారి వర్షాలు పడనున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రెండు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైద‌రా‌బాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

Telangana Rains : తెలంగాణలో రెండు రోజులపాటు వర్షాలు

Telangana Rains

Updated On : August 5, 2021 / 3:12 PM IST

Telangana Rains : తెలంగాణలో మరోసారి వర్షాలు పడనున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రెండు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైద‌రా‌బాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ దిశ‌ నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తు‌న్నా‌యని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం అధి‌కారి నాగ‌రత్న వెల్లడించారు.

గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ తేలి‌క‌పాటి వర్షాలు కురు‌స్తా‌యని తెలిపారు. ఒకటి రెండు‌చోట్ల ఓ మోస్తరు వర్షం పడుతుందని పేర్కొన్నారు. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కొమురంభీం ఆసిఫాబాద్‌, వికారాబాద్‌, నారాయణపేట, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌తో పాటు పలు జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి.