వడ్ల కొనుగోలు సెంటర్లలో తడిసిన ధాన్యం.. తెలంగాణకు మళ్లీ వర్ష సూచన
Rains likely in Telangana: జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట..

Rains
మొన్నటి వరకు ఇంట్లో నుంచి కాలు బయటపెట్టనివ్వకుండా ఎండలు.. ఇప్పుడేమో భారీ వర్షాలు. ఎండాకాలం ముగియకముందే వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇవాళ కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పారు. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ్ పేట్, జోగులాంబ గద్వాల జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు.
మరోవైపు, మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలో అకాల వర్ష బీభత్సం సృష్టించింది. మండలంలోని పలు వడ్ల కొనుగోలు సెంటర్లలో ధాన్యం తడిసింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సారి నైరుతి రుతుపవనాలు కూడా త్వరగా ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే తెలిపారు.
Also Read : దేశంలో 56శాతం రోగాలకు ఆహారమే కారణం.. ఎంత తినాలంటే? : ఐసీఎమ్ఆర్ సూచనలు